విజయవాడ: తెలంగాణ నుండి ఆంధ్ర ప్రదేశ్ కు అక్రమంగా తరలిస్తున్న భారీ మద్యం బాటిళ్లను కృష్ణా జిల్లా పోలీసులు పట్టుకున్నారు. అర్థరాత్రి సమయంలో ఆటోలో తరలిస్తున్న 1270 బాటిళ్లను పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఈ మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరు నిందితులను పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. 

మద్యపాన నిషేదంలో భాగంగా ఏపీలో మద్యం ధరలను భారీగా పెంచింది జగన్ ప్రభుత్వం. అయితే పక్కరాష్ట్రాల నుండి అక్రమంగా మద్యాన్ని ఏపీకి రవాణా చేస్తున్నాయి కొన్ని ముఠాలు. కానీ ఎంత తెలివిగా మద్యం అక్రమ రవాణాకు పాల్పడే ప్రయత్నం చేసినా ఎక్కడికక్కడ వారి ఆటలను చిత్తు చేస్తున్నారు ఏపీ పోలీసులు. ఎక్కడికక్కడ నిఘా వ్యవస్థను పటిష్ట పరుస్తూ బార్డర్ల వద్ద ఏ ఒక్క వాహనాన్ని వదలకుండా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ రవాణా పై ఉక్కు పాదం  మోపుతున్నారు.  

వీడియో

"

శనివారం అర్థరాత్రి జగ్గయ్య పేట పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో ముక్త్యాల కాకతీయ సిమెంట్ ఫ్యాక్టరీ పక్కన డొంక రోడ్డులో నిర్వహించిన ఈ తనిఖీలు ఆటోలో తరలిస్తున్న భారీ మద్యం పట్టుబడింది. 

తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడ నుండి ఈ మద్యాన్ని తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రవాణాకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ఆటోను సీజ్ చేసి వారిపై జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.