Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో కొనసాగుతున్న కోవిడ్ ఉద్ధృతి: కొత్తగా 12,561 కేసులు.. గుంటూరు, కర్నూలులో తీవ్రత

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 12,561 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 22,45,713కి చేరుకుంది.

12561 new corona cases reported in andhra pradesh
Author
Amaravathi, First Published Jan 28, 2022, 6:09 PM IST

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 12,561 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 22,45,713కి చేరుకుంది. నిన్న మహమ్మారి వల్ల విశాఖపట్నంలో ముగ్గురు, కర్నూలు, నెల్లూరులలో ఇద్దరు.. అనంతపురం , చిత్తూరు, గుంటూరు, విజయనగరం, పశ్చిమ గోదావరిలలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,591కి చేరుకుంది. 

24 గంటల్లో కరోనా నుంచి 8,742 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 21,17,822కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 40,635 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,23,65,775కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,13,300 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 853, చిత్తూరు 423, తూర్పుగోదావరి 1067, గుంటూరు 1625, కడప 1215, కృష్ణ 1056, కర్నూలు 1710, నెల్లూరు 1009, ప్రకాశం 869, శ్రీకాకుళం 340, విశాఖపట్నం 1211, విజయనగరం 489, పశ్చిమ గోదావరిలలో 694 చొప్పున వైరస్ బారినపడ్డారు.

మరోవైపు దేశంలో గత కొన్ని రోజులుగా నిత్యం రెండు లక్షలకు పైగానే (Coronavirus)  పాజిటివ్‌ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. అయితే, కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల్లో స్వ‌ల్పంగా త‌గ్గుద‌ల న‌మోదైంది.  గురువారం 2.8 లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, కొత్తగా 2.51 లక్షలకు (Coronavirus) తగ్గాయి. దీంతో పాజిటివిటీ రేటు కూడా తగ్గింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన క‌రోనా వైర‌స్ వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 2,51,209 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్‌-19 కేసులు 4,06,22,709కి చేరాయి. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,80,24,771 మంది బాధితులు కరోనా వైరస్(Coronavirus) నుంచి కోలుకున్నారు.  గ‌త 24 గంట‌ల్లోనే 3 ల‌క్ష‌ల మందికి పైగా కోలుకోవ‌డం ఊర‌ట క‌లిగించే విష‌యం. కొత్త‌గా  3,47,443 మంది కోవిడ్‌-19 నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసులు అధికం అవుతూనే ఉన్నాయి. ప్ర‌స్తుతం  21,05,611 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి.

క‌రోనా (Coronavirus) మ‌ర‌ణాలు మాత్రం త‌గ్గ‌డం లేదు. గ‌త 24 గంట‌ల్లో క‌రోనా వైర‌స్ (Coronavirus) తో పోరాడుతూ కొత్తగా 627 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశంలో ఇప్పటివ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య  4,92,327కు పెరిగింది. కరోనా కేసులు తక్కువవడంతో రోజువారీ పాజిటివిటీ రేటు 15.28 శాతానికి తగ్గింది. క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌తో పాటు క‌రోనా ప‌రీక్ష‌ల‌ను ముమ్మ‌రంగా కొన‌సాగిస్తున్నారు అధికారులు. ఇప్పటివరకు 1,64,44,73,216 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు. అంద‌లో మొద‌టి డోసు తీసుకున్న‌వారు 89.1 కోట్ల మంది ఉండ‌గా, రెండు డోసులు తీసుకున్న వారు 69.9 కోట్ల మంది ఉన్నారు. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 72,21,66,248 క‌రోనా (Coronavirus) ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన భార‌తీయ వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్‌) వెల్ల‌డించింది. గురువారం ఒక్క‌రోజే 14,62,261 క‌రోనా (Coronavirus) మ‌హ‌మ్మారి శాంపిళ్ల‌ను ప‌రీక్షించిన‌ట్టు తెలిపింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios