కడప జిల్లా మైదుకూరులో దారుణం జరిగింది. కరెంట్ షాక్‌తో ఓ బాలుడు మరణించాడు. పట్టణానికి చెందిన 12 ఏళ్ల బాలుడు సొహైల్ శుక్రవారం తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు.

బంతి ట్రాన్స్‌ఫార్మార్ దగ్గర పడింది. ఈ క్రమంలో బాల్ తీసుకొచ్చేందుకు ట్రాన్స్‌ఫార్మార్ వద్దకు వెళ్లాడు సొహైల్. అయితే బంతి తీస్తుండగా చిన్నారి చేయి కరెంట్ తీగలకు తగిలింది.

దీంతో కరెంట్ షాక్ తగిలి శరీరమంతా కాలిపోయింది. అతని అరుపులు విన్న స్థానికులు చిన్నారిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.