Asianet News TeluguAsianet News Telugu

12 మందికి ఉరిశిక్ష: మున్నా గ్యాంగ్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు

లారీ డ్రైవర్లను, క్లీనర్లను లక్ష్యంగా చేసుకుని హైవేలపై హత్యకాండ సాగించిన మున్నా గ్యాంగ్ కు చెందిన 1 మందికి ఒంగోలు కోర్టు మరణశిక్ష వేసింది. వారిలో ఇద్దరిని రెండుసార్లు ఉరి తీయాలని కూడా కోర్టు ఆదేశించింది.

12 members of Munna gang get capital punshment: Ongole Court judgement
Author
Ongole, First Published May 24, 2021, 2:12 PM IST

ఒంగోలు: హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ కేసులో ప్రకాశం జిల్లా ఒంగోలు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో 12 మందికి కోర్టు మరణిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. హైవేలపై లారీ డ్రైవర్లు, క్లీనర్లు లక్ష్యంగా మున్నా గ్యాంగ్ హత్యలకు పాల్పడింది.మున్నా సహా 12 మందికి కోర్టు ఉరిశిక్ష విధించింది. వారిలో ఇద్దరిని రెండుసార్లు ఉరితీయాలని తీర్పు చెప్పింది.

మున్నా గ్యాంగ్ 13 ఏళ్ల క్రితం ఏడుగురు లారీ డ్రైవర్లను, క్లీనర్లను హత్య చేసింది. మున్నా 13 హత్య కేసుల్లో నిందితుడు. కాగా నాలుగు కేసుల్లో నేరం రుజువైందని ఒంగోలు కోర్టు స్పష్టం చేసింది. లారీ డ్రైవర్లను, క్లీనర్లను దారుణంగా హత్య చేసి గోతాల్లో కుక్కి వాగుల వద్ద పూడ్చిపెట్టిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. 

2008లో వెలుగు చూసిన 4 కేసుల్లో 18 మంది నేరం నిర్దారణ అయింది. పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్ నుంచి 21.7 టన్నుల ఇనపు రాడ్లతో తమిళనాడు కల్పక్కం బయలుదేరిన లారీతో పాటు డ్రైవర్, క్లీనర్ అదృశ్యమయ్యారని 2008 అక్టోరుబర్ 17వ తేదీన యజమాని వీరప్పన్ కుప్పుస్వామి ఒంగోలు తాలుకూ పోలీసు స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పాత ఇనుము వ్యాపారులపై దృష్టి పెట్టారు. 

దాదాపు 20కి పైగా సిమ్ కార్డులు మార్చి దేశం వదిలి పారిపోయేందుకు ప్రయత్నించిన మున్నాను కర్ణాటకలోని ొక మాజీ ఎమ్మెల్యే ఫాంహౌస్ లో అరెస్టు చేసి ఒంగోలుకు తీసుకుని వచ్చారు 

మున్నా గ్యాంగ్ పోలీసు వేషాలు ధరించి వచ్చిపోయే వాహనాలను ఆపేసేవారు. మున్నాకు సెక్యూరిటీ మెషన్ ధరించిన వ్యక్తి కూడా ఉండడంతో పెద్ద అధికారి వచ్చారంటూ డ్రైవర్లను లారీలను ఆపేవారు. గ్యాంగ్ సభ్యులు తనిఖీ పేరుతో లారీల డ్రైవర్లు, క్లీనర్ల గొంతులకు తాడు బిగింది చంపేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఒంగోలు పరిధిలోని 4 కేసుల్లో ఎడుగురిని హత్య చేసినట్లు నిరూపణ అయింది. 

తమిళనాడు లారీ డ్రైవర్ రామశేఖర్, క్లీనర్ పెరుమాళ్ సుబ్రమణిలను ఉలవపాడు సమీపంలో హత్య చేసి అందులోని 21.7 టన్నుల ఇనుమును గుంటూరులోని ఓ ప్రముఖ వ్యాపారికి విక్రయించారు. డ్రైవర్, క్లీనర్ శవాలను గోతాలలో కుక్కి మద్దిపాడు మండలం ఇనుమనమెళ్లూరు గుండ్లకమ్మ వాగు కట్టలో పూడ్చి పెట్ాటరు 

మరో ఘటనలో చత్తీస్ గఢ్ లోని రాయపూర్ ఉల్లా నుంచి కాంచీపురానికి ఇనుము లోడును తీసుకుని వెళ్తుండగా తెట్టు వద్ద ఆపి డ్రైవర్ భూషణ్ యాదవ్, క్లీనర్ చందన్ కుమార్ మెహాలను చంపి శవాలను మన్నేరు వాగు వద్ద పూడ్చిపెట్టారు. మరో ఘటనలో తమిళనాడులోని గుమ్మడిపూడి నుంచి కాకినాడుకు ఇనుప యాంగ్యులర్లతో బయులదేరిన లారిని మద్దిపాడు మండలం ఎడుగుండ్లపాడు నిమ్రా కాలేజీ వద్ద ఆపి డ్రైవర్లు గూడూరి శ్యాంబాబు, గుత్తుల వినోద్ కుమార్ లను చంపేసి శవాలను నాగులుప్పలపాడు మండలం చదలవాడ గుండ్లకమ్మ ఒడ్డున పూడ్చి పెట్టారు. 

నాగాలాండు కు చెందిన లారీని కూడా ఇదే విధంగా ఆపి డ్రైవర్ ను చంపేసి మద్దిపాడు మండలం ఇనుమనమళ్లూరు గ్రామంలోని గుండ్లకమ్మ వాగు పూడ్చిపెట్టారు. మున్నాపై కడప, నల్లగొండ, తెనాలి, విజయవాడ, బెంగళూర, ప్రకాశం జిల్లాల్లో పలు కేసులు ఉన్నాయి. పదో తరగతి వరకు చదువుకున్న మున్నా, తొలుత వైద్యం చేస్తూ ఆ తర్వాత మనుషులను కూడగట్టుకుని ముఠాను తయారు చేసుకుని ఘాతుకాలకు పాల్పడుతూ వచ్చాడు.

Follow Us:
Download App:
  • android
  • ios