Asianet News TeluguAsianet News Telugu

12 మంది మత్స్యకారులు సురక్షితం: చెన్నై తీరంలో గుర్తింపు

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు సమీపంలో గల్లంతైన బోటు నుండి చివరిసారిగా సిగ్నల్శ్రీకాకుళం జిల్లాకు చెందిన 12 మంది మత్స్యకారులు ఆచూకీ లభ్యమైంది.  చెన్నై తీరంలో 12 మంది మత్స్యకారుల ఆచూకీని  కోస్ట్ గార్డ్ గుర్తించారు. 
 

12 fishermen found safe near chennai sea coast lns
Author
Srikakulam, First Published Jul 19, 2021, 8:43 PM IST


శ్రీకాకుళం: ఆచూకీ లేకుండా పోయిన 12 మంది మత్స్యకారులు  సురక్షితంగా ఉన్నారని  అధికారులు ప్రకటించారు. దీంతో మత్స్యకారుల కుటుంబాలు ఊపిరి పీల్చుకొన్నారు.చెన్నై తీర ప్రాంతంలో గల్లంతైన 12 మంది మత్స్యకారులను కోస్ట్‌గార్డ్స్ గుర్తించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు ఉపాధి కోసం చెన్నైలోని ఫిషింగ్ హర్బర్  నుండి  ఈ నెల 7న  బోటులో వేటకు వెళ్లారు.ఈ నెల 16వ తేదీ వరకు కుటుంబసభ్యులతో వారంతా టచ్ లో ఉన్నారు. 

also read:కృష్ణపట్టణం పోర్టు వద్ద చివరిసారిగా సిగ్నల్: 12 మంది మత్స్యకారుల కోసం గాలింపు

మత్స్యకారుల కుటుంబసభ్యులు ఏపీ మంత్రి అప్పలరాజుకు ఈ విషయమై సమాచారం ఇచ్చారు. అయితే నెల్లూరు జిల్లా కృష్ణపట్టణం  పోర్టులో చివరిసారిగా సిగ్నల్స్ గుర్తించినట్టుగా  అధికారులు తెలిపారు. తమిళనాడు, ఏపీ అధికారులు  హెలికాప్టర్, విమానాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు.అయితే చెన్నై తీర ప్రాంతంలోనే మత్స్యకారులను గుర్తించారు. ఈ విషయమై అధికారులు ఏపీ అధికారులకు సమాచారం ఇచ్చారు.ఈ సమాచారాన్ని  మత్స్యకారుల కుటుంబాలకు సమాచారం అందించారు అధికారులు.


 

Follow Us:
Download App:
  • android
  • ios