ఏపీలో కొత్తగా 1,190 కరోనా కేసులు నమోదవ్వగా.. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 1,226 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 15,110 మంది చికిత్స పొందుతున్నారు

ఆంధ్రప్రదేశ్‌‌‌లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,190 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,27,090కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,998కి చేరుకుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల నెల్లూరు 1, కృష్ణ 2, ప్రకాశం 2, తూర్పుగోదావరి 2, గుంటూరు 2, విశాఖపట్నం, పశ్చిమ గోదావరిలలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 1,226మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 19,97,982కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 45,533 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,73,24,895కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 15,110 మంది చికిత్స పొందుతున్నారు. 

నిన్న ఒక్కరోజు అనంతపురం 19, చిత్తూరు 219, తూర్పుగోదావరి 83, గుంటూరు 117, కడప 69, కృష్ణ 164, కర్నూలు 10, నెల్లూరు 139, ప్రకాశం 121, శ్రీకాకుళం 48, విశాఖపట్నం 65, విజయనగరం 22, పశ్చిమ గోదావరిలలో 114 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.


Scroll to load tweet…