ఏపీలో కరోనా ఉద్ధృతి: కొత్తగా 1,184 కేసులు.. ఒక్క గుంటూరులోనే 352 మందికి పాజిటివ్
దేశంలోని మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గుజరాత్ బాటలోనే ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా విజృంభిస్తోందా..? అప్రమత్తమై నష్టనివారణా చర్యలు చేపట్టకపోతే పరిస్ధితి అదుపు తప్పుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. గడిచిన మూడు నెలల కాలంలో ఎన్నడూ లేని విధంగా భారీగా కేసులు నమోదయ్యాయి.
దేశంలోని మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గుజరాత్ బాటలోనే ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా విజృంభిస్తోందా..? అప్రమత్తమై నష్టనివారణా చర్యలు చేపట్టకపోతే పరిస్ధితి అదుపు తప్పుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.
గడిచిన మూడు నెలల కాలంలో ఎన్నడూ లేని విధంగా భారీగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,184 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 9,01,989కి చేరుకుంది.
గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ వల్ల చిత్తూరులో ముగ్గురు, నెల్లూరులో ఒకరు మరణించారు. దీంతో వైరస్ బారినపడి రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,217కి చేరింది.
ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 7,338 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 456 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 8,87,434కి చేరింది.
నిన్న ఒక్క రోజు 30,964 మందికి కోవిడ్ నిర్థారణా పరీక్షలు నిర్వహించగా... ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,50,83,179కి చేరుకుంది.
గడిచిన 24 గంటల్లో అనంతపురం 66, చిత్తూరు 115, తూర్పుగోదావరి 26, గుంటూరు 352, కడప 62, కృష్ణా 113, కర్నూలు 64, నెల్లూరు 78, ప్రకాశం 45, శ్రీకాకుళం 47, విశాఖపట్నం 186, విజయనగరం 19, పశ్చిమ గోదావరిలలో 11 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.