దేశ వ్యాప్తంగా మరోసారి కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. ఇదే  సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ కేసులు పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు రోజూ వారి కేసుల సంఖ్య 100 లోపే వుండేది. అయితే ఇవాళ ఈ సంఖ్య సెంచరీని దాటేసింది.

దేశ వ్యాప్తంగా మరోసారి కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ కేసులు పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు రోజూ వారి కేసుల సంఖ్య 100 లోపే వుండేది. అయితే ఇవాళ ఈ సంఖ్య సెంచరీని దాటేసింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గడిచిన 24 గంటల్లో కొత్తగా 117 మందికి కోవిడ్ సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 8,89,916కి చేరింది.

కోవిడ్ వల్ల నిన్న ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. నేటి వరకు రాష్ట్రంలో వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,169కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 718 మంది చికిత్స పొందుతున్నారు.

గడిచిన 24 గంటల్లో 66 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు డిశ్చార్జ్‌ల సంఖ్య 8,82,029కి చేరుకుంది. నిన్న రాష్ట్రంలో 39,122 మందికి కోవిడ్ నిర్థారణా పరీక్షలు నిర్వహించడంతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టెస్టుల సంఖ్య 1,39,54,131కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో అనంతపురం 4, చిత్తూరు 41, తూర్పుగోదావరి 2, గుంటూరు 17, కడప 8, కృష్ణ 11, కర్నూలు 2, నెల్లూరు 9, ప్రకాశం 1, శ్రీకాకుళం 10, విశాఖపట్నం 6, విజయనగరం 1, పశ్చిమ గోదావరిలలో 5 కేసులు చొప్పున నమోదయ్యాయి. 


Scroll to load tweet…