బాలికపై గ్యాంగ్‌రేప్.. మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన చిన్నారి
పుంగనూరు మండలం జట్టి గుండ్లపల్లికి చెందిన బాలికపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై తీవ్ర మనస్తాపానికి గురైన చిన్నారి ఆత్మహత్యాయత్నం చేసింది.

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. 11 ఏళ్ల బాలికపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. పుంగనూరు మండలం జట్టి గుండ్లపల్లికి చెందిన బాలికపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.
దీనిపై తీవ్ర మనస్తాపానికి గురైన చిన్నారి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను కుటుంబసభ్యులు కర్ణాటకలోని ఓ ఆసుపత్రికి తరలించి 11 రోజులుగా చికిత్స అందిస్తున్నారు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే దానిపై స్పష్టత లేదు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.