కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం కొరగంటిపాలెంలో దారుణం జరిగింది. ఆడపిల్ల పుట్టిందని  శిశువును వదిలేసి పోయారు తల్లిదండ్రులు. కొరగంటిపాలెంలో ఓ 11నెలల చిన్నారిని తుప్పల్లో వదిలేసిపోయారు.

పాప ఏడుపు గమనించిన స్థానికులు చూడగా చిన్నారి శరీరంపై అక్కడక్కడా గాయాలు ఉన్నాయి. దీంతో పాపను వదిలేసే ముందు చంపడానికి ప్రయత్నించారా అనే దిశగా అనుమానాలు రేకెత్తుతున్నాయి.

చంపడం సాధ్యపడకే వదిలేసి ఉంటారని స్థానికులు అంటున్నారు. అర్థరాత్రి పూట గుట్టు చప్పుడు కాకుండా ఇక్కడ వదిలేసి వెళ్లారని తెలిపారు. ప్రస్తుతం చిన్నారిని స్థానికుల సాయంతో పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.