ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం మరో నిండు ప్రాణం బలైంది. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గానికి చెందిన 10వ తరగతి చదువకుంటున్న మహేంద్ర అనే బాలుడు హోదా రావడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం మరో నిండు ప్రాణం బలైంది. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గానికి చెందిన 10వ తరగతి చదువకుంటున్న మహేంద్ర అనే బాలుడు హోదా రావడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహం వద్ద లభించిన సూసైడ్ నోట్‌లో తాను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనేది రాశాడు.. అందులో ఏముందంటే..
Add Asianetnews Telugu as a Preferred Source

‘‘ నా పేరు జీ. మహేంద్ర... మాకు చానా అప్పులున్నాయి...అట్టనే మా నాయనకి కూడా ఆరోగ్యం బాగోదు..ఒకాల నేను చదువుకున్నా ఉద్యోగం రాదు.. మన రాష్ట్రానికి ప్రత్యేకఓదా అన్నా ఇచ్చుంటే.. మా యన్నకి యాదో ఒక ఉద్యోగం వచ్చేది.. ఓదా వల్ల మనకు చానా మేలు జరుగుతుందట.. నేను టీవీలో వార్తల్లో విన్నాను..తెలంగాణ కోసం చానామంది సచ్చిపోయినారు.. ఓదా కోసం నేను సచ్చిపోతున్నాను.. ఏట్లా ఏవురికీ లాభం ఏం లేదు’’

"
