ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం మరో నిండు ప్రాణం బలైంది. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గానికి చెందిన మహేంద్ర అనే బాలుడు ప్రత్యేక హోదా రావడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం మరో నిండు ప్రాణం బలైంది. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గానికి చెందిన మహేంద్ర అనే బాలుడు ప్రత్యేక హోదా రావడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Add Asianetnews Telugu as a Preferred Source

మహేంద్ర రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. దానిలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చివుంటే అన్నకు ఉద్యోగం వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ బాలుడు స్థానిక పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు.
