ఆంధ్రప్రదేశ్ కరోనా ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,601 కోవిడ్ కేసులు  నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కలిపి ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 5,17,094కి చేరింది.

నిన్న కొత్తగా 73 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 4,560కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 96,769 యాక్టివ్ కేసులున్నాయి. 4,15,765 మంది డిశ్చార్జ్ అయ్యారు.

గడిచిన 24 గంటల్లో 70,993 మందికి కోవిడ్ నిర్థారణా పరీక్షలు చేశారు. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం టెస్టుల సంఖ్య 42,37,070కి చేరింది. నిన్న ఒక్క రోజే 11,691 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.

గుంటూరులో 10, అనంతపురం 8, చిత్తూరు 8, కడప 7, ప్రకాశం 7, నెల్లూరు 6, విశాఖపట్నం 6, తూర్పుగోదావరి 5, కృష్ణ 5, పశ్చిమ గోదావరి 5, శ్రీకాకుళం 3, కర్నూలు 2, విజయనగరంలో ఒక్కరు చొప్పున మరణించారు.

నిన్న కొత్తగా అనంతపురం 441, చిత్తూరు 1,178, తూర్పు గోదావరి 1,426, గుంటూరు 702, కడప 801, కృష్ణ 389, కర్నూలు 514, నెల్లూరు 1042, ప్రకాశం 1,457, శ్రీకాకుళం 505, విజయనగరం 598, పశ్చిమ గోదావరిలలో 1,122 కేసులు నమోదయ్యాయి.