ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 102 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 8,90,317కి చేరింది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 102 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 8,90,317కి చేరింది. కరోనా కారణంగా నిన్న చిత్తూరులో ఒకరు మరణించారు. దీనితో కలిపి ఏపీలో వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7171కి చేరింది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ఆసుపత్రుల్లో 871 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 56 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటి వరకు మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,82,275కి చేరింది.

నిన్న 45,077 మందికి కరోనా నిర్థారణా పరీక్షలు నిర్వహించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,40,92,251కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో అనంతపురం 4, చిత్తూరు 25, తూర్పు గోదావరి 13, గుంటూరు 5, కడప 2, కృష్ణా 8, నెల్లూరు 6, ప్రకాశం 3, శ్రీకాకుళం 3, విశాఖ 22, విజయనగరం 0, పశ్చిమ గోదావరిలలో మూడు కేసుల చొప్పున నమోదయ్యాయి.


Scroll to load tweet…