Asianet News TeluguAsianet News Telugu

జేసీ దివాకర్‌రెడ్డికి షాకిచ్చిన మైనింగ్ అధికారులు... 100 కోట్ల జరిమానా.. కట్టకపోతే..

అక్రమ మైనింగ్ వ్యవహారంలో జేసీ దివాకర్ రెడ్డికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు మైనింగ్ అధికారులు. వంద కోట్ల భారీ జరిమానా విధించాలని నిర్ణయించారు. జరిమానా కట్టకపోతే ఆర్అండ్ఆర్ చట్టం కింద ఆస్తుల జప్తు చేపడతామని హెచ్చరించారు. 

100 Crore Fine To JC Diwakar Reddy In Illegal Mining Case at Andhrapradesh - bsb
Author
Hyderabad, First Published Dec 1, 2020, 9:16 AM IST

అక్రమ మైనింగ్ వ్యవహారంలో జేసీ దివాకర్ రెడ్డికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు మైనింగ్ అధికారులు. వంద కోట్ల భారీ జరిమానా విధించాలని నిర్ణయించారు. జరిమానా కట్టకపోతే ఆర్అండ్ఆర్ చట్టం కింద ఆస్తుల జప్తు చేపడతామని హెచ్చరించారు. 

టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి త్రిశూల్‌ సిమెంట​ ఫ్యాక్టరీలో భారీ ఎ‍త్తున అక్రమాలకు పాల్పడ్డ కారణంగా మైనింగ్ అధికారులు రూ.100 కోట్ల జరిమానా విధించాలని నిర్ణయించారు. అనంతపురం జిల్లా యాడికి మండలం కోన ఉప్పలపాడులో అక్రమ తవ్వకాలు జరిపి.. 14 లక్షల మెట్రిక్ టన్నుల దోపిడీ జరిగినట్లు అధికారులు గుర్తించారు. 

విలువైన లైమ్ స్టోన్‌ను నిబంధనలకు విరుద్ధంగా తవ్వి విక్రయించారని అభియోగాలు నమోదు చేశారు. తన ఇంట్లో పనిచేసే పనిమనుషులు, డ్రైవర్ల పేరుతో త్రిశూల్ సిమెంట్స్ అనుమతులు పొందారు. అంతేకాకుండా అనుమతులు వచ్చాక పనిమనుషుల నుంచి కుటుంబ సభ్యులకు వాటాలు బదలాయింపు చేశారు. 

టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అ‍డ్డుపెట్టుకుని పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. అక్రమ మైనింగ్‌తో పాటు జేసీ ట్రావెల్స్‌ నింబంధనల ఉల్లంఘనపై కూడా అధికారులు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. 

మరోవైపు అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలోని ముచ్చుకోట అటవీ ప్రాంతంలో దివాకర్‌రెడ్డి కుటుంబీకులు నిర్వహిస్తున్న సుమన, భ్రమరాంబ మైనింగ్‌ సంస్థల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్టు గుర్తించామని అధికారులు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన రెండు డోలమైట్‌ మైనింగ్‌ క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా పనులు నిర్వహించడంతో వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios