విషాదం.. హోమియో మందుల డబ్బా గొంతులో ఇరుక్కుని.. పదినెలల బాలుడు మృతి...
హోమియో మందుల డబ్బా గొంతులో ఇరుక్కుని ఊపిరాడక ఓ పదినెలల చిన్నారి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన కర్నూలులో విషాదం నింపింది.

కర్నూలు జిల్లా : లేక లేక పుట్టిన బిడ్డ అనుకోకుండా.. హఠాత్తుగా మరణించడం ఆ ఇంట్లో విషాదాన్ని నింపింది. హోమియో మందుల డబ్బాను ఆడుకునే వస్తువు అనుకుని నోట్లో పెట్టుకున్న ఆ చిన్నారి.. డబ్బా గొంతులో ఇరుక్కోవడంతో మృతి చెందింది. పెళ్లైన 20 యేళ్లకు పుట్టిన బిడ్డ సంవత్సరం కూడా తిరకుండానే అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ఆ కన్నతల్లి కన్నీటిని ఆపడం ఎవ్వరి తరమూ కావడం లేదు.
ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా సి. బెళగల్ మండలం చింతమానుపల్లెలో చోటు చేసుకుంది. ఈ విషాదం మీద ఆ కుటుంబ సభ్యులు ఈ మేరకు వివరాలు తెలియజేశారు. నల్లన్న, సువర్ణమ్మ దంపతులు. కూలీపనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరు చింమతమానుపల్లె గ్రామంలోని దళితవాడలో ఉంటున్నారు. వీరికి వివాహం అయి రెండు దశాబ్దాలు అవుతున్నా పిల్లలు లేరు. 20 యేళ్లకు ఇటీవలే చిన్నారి ప్రదీప్ జన్మించాడు. లేకలేకపుట్టిన బిడ్డ కావడంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు.
ఏపీలో బీఆర్ఎస్ ప్రభావం శూన్యం.. జాతీయ పార్టీల విషయంలో వైసీపీ స్టాండ్ ఇదే..: కొడాలి నాని
అప్పుడప్పుడే మాటలు వస్తున్నాయి. అతని ముద్దు మాటలతో ఇల్లు సందడిగా ఉంటోంది. కొత్త సంవత్సరం సందర్భంగా అందరూ సరదాగా గడుపుతున్నారు. ఇంతలో పదినెలల చిన్నారి పాకుతూ వెళ్లి పక్కనే ఉన్న హోమియో మందుల డబ్బాను నోట్లో పెట్టుకున్నాడు. అది చిన్నాగా ఉండి అతని గొంతులోకి జారింది. దీంతో బైటికి రాక.. గొంతులోనే ఇరుక్కుపోయింది. ఊపిరి ఆడలేదు. చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది చూసి ఆ తల్లిదండ్రుల శోకంతో ఆ ప్రాంతం విషాదఛాయలు అలుముకున్నాయి.