అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతికి సమీపంలోని నెక్కల్లు వద్ద టీడీపీ నేత శ్రీధర్ కారు ఢీకొట్టడం వల్ల ఒక్కరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

అమరావతికి సమీపంలోని  నెక్కల్లు గ్రామంలో స్థానిక టీడీపీ నాయకుడు ఎ.బ్రహ్మం అతని కొడుకు అల్లూరి సుధాకర్ సరస్సును ఆక్రమించుకొనేందుకు ప్రయత్నించారు. అయితే సరస్సును ఆక్రమించుకొనే ప్రయత్నాన్ని స్థానిక యాదవ కులానికి చెందిన మహిళలు అడ్డుకొన్నారు. ఈ విషయమై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  టీడీపీ నేతకు ఆగ్రహాన్ని తెప్పించింది.ఎ. సుధాకర్ ఉద్దేశ్యపూర్వకంగా తమపై కేసు పెట్టిన వారిపై కారును నడపడంతో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.