ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లి జాతీయ రహదారిపై కావేరి  ట్రావెల్స్ కు చెందిన  ప్రైవేట్ బస్సు  బుధవారం నాడు బోల్తా పడింది. ఈ ఘటనలో  ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో  13 మంది గాయపడ్డారు.

పశ్చిమ గోదావరి జిల్లా పెరవల్లి మండలం ఖండవల్లి వద్ద నాలుగు రోడ్ల కూడలి వద్ద ఒక్కసారిగా ప్రైవేట్ బస్సుకు అడ్డంగా టీవీఎస్ 50 బైక్  వచ్చింది. దీంతో కావేరీ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ బస్సును నిలిపివేసేందుకు ప్రయత్నించాడు. కానీ,   బస్సు  అదుపు తప్పింది. టీవీఎస్ 50 బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. 

Also read:నాకు ఎటువంటి గాయాలు కాలేదు.. హీరో రాజశేఖర్

ట్రావెల్స్ బస్సులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో  33 మంది స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరికొందరిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. 

కావేరీ ట్రావెల్స్ బస్సు హైద్రాబాద్‌ నుండి విశాఖపట్టణం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఇటీవల కాలంలో  రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సులు తరచూ ప్రమాదాలకు గురౌతున్నాయి.

ట్రావెల్స్  బస్సుల ప్రమాదాలపై రెండు రాష్ట్రాలు జాగ్రత్తలు తీసుకొంటున్నాయి. ట్రావెల్స్ బస్సుల డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారా అనే విషయమై కూడ రవాణ, పోలీసు శాఖాధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.