
Homemade Kulfi: వేసవికాలం వచ్చేసింది. ఇక భానుడి భగభగలుతో ప్రజలు తల్లాడిల్లుతున్నారు. వేసవిపాతాన్ని తట్టుకోవాలంటే.. పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్ తినాల్సిందే. అందులో పిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతో ఇష్టంగా తినే వాటిలో కుల్ఫీ ఒకటి. ఐస్‌క్రీమ్‌లలో అయితే వివిధ రకాల ఫ్లేవర్స్ ఉంటాయో.. కుల్ఫీల్లో కూడా వివిధ రకాలైన రుచికరమైన ఫ్లేవర్స్ ఉంటాయి. కేవలం 5 పదార్థాలతో ఇంట్లోనే రుచికరమైన పిస్తా కుల్ఫీ తయారు చేసుకోవచ్చు, ఆ చల్లచల్లని, రుచికరమైన పిస్తా కుల్ఫీ తయారు చేసే సులభమైన పద్ధతి తెలుసుకుందాం-
3/4 కప్పు పెరుగు
1/4 కప్పు పాలు
1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి
1/2 చక్కెర
బాదం
జీడిపప్పు
పిస్తా కుల్పీ తయారు చేయడానికి ఒక గిన్నెలో ముప్పావు కప్పు పెరుగు తీసుకోండి. దానిలో వేడి పాలు కలపండి. వీటిని చిక్కగా అయ్యే వరకు కలపండి. ఇప్పుడు అందులో యాలకుల పొడి వేయండి. ఆ తరువాత కుంకుమ పాలు కూడా వేయండి. కుంకుమ పాలు లేకపోతే బాదం పాలు కూడా వాడవచ్చు.
ఆ తరువాత రెండు చెంచాల మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేయండి. కుల్ఫీకి క్రీమీ టెక్చర్ వస్తుంది. కొంత సేపు అలాగే ఉంచండి. ఇ ప్పుడు ఒక గ్రైండింగ్ జార్ లో తురిమిన బాదం, జీడిపప్పు, పిస్తా వేయండి. చక్కెర కూడా వేసి, తయారుచేసిన మిల్క్ బ్యాటర్ కలిపి పేస్ట్ లా చేయండి. అన్ని డ్రై ఫ్రూట్స్ పేస్ట్ లా అయ్యే వరకు కలపండి.
ఈ మిశ్రమంలో రెండు చుక్కల పుడ్ కలర్ ను కలుపుకోండి. ఇప్పుడు దానిని ఒక గిన్నెలోకి తీసుకుని, ముక్కలుగా కోసిన పిస్తా, జీడిపప్పు వేసి కలపండి. దానిని కుల్ఫీ గ్లాసుల్లో లేదా మోల్డ్స్ లో పోసి, అల్యూమినియం ఫాయిల్ తో కవర్ చేయండి. ఆ తరువాత దానిని ఫ్రీజర్ లో ఉంచండి. ఫైనల్ గా రుచికరమైన పిస్తా కుల్ఫీ సిద్ధమయినట్టే. దీన్ని మీరు సర్వ్ చేయవచ్చు.