
మీ ఫేస్ లో ఫ్యాట్ పెరిగిపోయిందా? దాని వల్ల డబల్ చిన్ పెరిగిపోయి అంద వికారంగా కనపడుతున్నారా? అయితే.. కొన్ని సింపుల్ మార్పులను మీ లైఫ్ స్టైల్ లో భాగం చేసుకుంటే.. ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. మరి, దాని కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
సమతుల్య ఆహారం తీసుకోండి:
ఆరోగ్యకరమైన ఆహారం బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉన్నవి తినకుండా, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోండి. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించి,ఫేస్ ప్యాట్ తగ్గడానికి సహాయపడుతుంది.
నీళ్లు బాగా తాగండి:
శరీరానికి నీళ్లు చాలా అవసరం. నీళ్లు తాగితే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి, జీవక్రియలు మెరుగుపడతాయి. నీళ్లు తాగితే కడుపు నిండిన భావన కలుగుతుంది, తక్కువ ఆహారం తీసుకుంటారు. ఇది బరువు తగ్గడానికి, మొహం మీద ఫ్యాట్ తగ్గడానికి దోహదపడుతుంది. రోజుకి 8-10 గ్లాసుల నీళ్లు తాగడం మంచిది.
ఫేస్ ఎక్సర్ సైజ్ లు చేయండి..
మొహం మీద కొవ్వు తగ్గించడానికి కొన్ని వ్యాయామాలు చేయవచ్చు. బెలూన్స్ ఊదడం, పెదాలు ముడుచుకోవడం, దవడ కదిలించడం వంటి వ్యాయామాలు రోజూ చేస్తే మొహం కండరాలు బలపడి, కొవ్వు తగ్గుతుంది. ఇవి మొహానికి మంచి ఆకారం, కాంతినిస్తాయి.
నిద్ర చాలా ముఖ్యం:
నిద్ర లేకపోతే కార్టిసాల్ అనే హార్మోన్ పెరుగుతుంది. ఇది శరీరంలో, ముఖ్యంగా మొహం మీద కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. రోజుకి 7-8 గంటలు ప్రశాంతంగా నిద్రపోతే బరువు, మొహం మీద కొవ్వు తగ్గుతాయి.
కార్డియో వ్యాయామాలు చేయండి:
ఏరోబిక్ వ్యాయామాలు శరీరంలోని కొవ్వును కరిగించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. పరుగెత్తడం, ఈత కొట్టడం, సైక్లింగ్, డాన్స్ వంటివి రోజూ లేదా వారంలో కొన్ని సార్లు చేస్తే బరువు, మొహం మీద కొవ్వు తగ్గుతాయి. ఇవి మీ గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.
సోడియం తక్కువగా తీసుకోండి:
ఎక్కువ సోడియం తీసుకుంటే శరీరంలో నీరు నిల్వ ఉంటుంది. దీనివల్ల మొహం ఉబ్బినట్టు కనిపిస్తుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చిప్స్ వంటివి తినకుండా ఉంటే సోడియం తగ్గుతుంది. ఇంట్లో వంట చేసేటప్పుడు ఉప్పు తక్కువ వాడి, దాని బదులు మూలికలు, మసాలా దినుసులు వాడండి.
మద్యం తాగడం తగ్గించండి:
మద్యం ఎక్కువగా తాగితే శరీరంలో నీళ్లు తగ్గి, బరువు పెరుగుతారు. కొన్ని మద్యం రకాల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. మద్యం తాగడం తగ్గిస్తే బరువు, ఫేస్ ప్యాట్, డబల్ చిన్ తగ్గించుకోవచ్చు.
మొహానికి మసాజ్ చేయండి:
మొహానికి మసాజ్ చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది మొహం మీద ఉండే ద్రవాన్ని బయటకు పంపి, ఉబ్బరం తగ్గిస్తుంది. రోజూ కొన్ని నిమిషాలు మొహానికి పైకి వృత్తాకారంలో మసాజ్ చేయడం మంచిది.
సరైన భంగిమలో ఉండండి:
కూర్చునేటప్పుడు, నడిచేటప్పుడు సరైన భంగిమలో ఉండటం వల్ల ఫేస్ ఫ్యాట్ తగ్గినట్టు కనిపిస్తుంది. వంగి కూర్చుంటే మొహం లావుగా కనిపిస్తుంది. నిటారుగా కూర్చోవడం, నడవడం వల్ల మొహం సన్నగా కనిపిస్తుంది.
బరువు నియంత్రణలో ఉంచుకోండి:
ఫేస్ ఫ్యాట్ పెరగడానికి ప్రధాన కారణం బరువు పెరగడమే. కాబట్టి, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం ద్వారా బరువును నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం.