
PCOS (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) PCOD (పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్) నేటి జీవనశైలిలో సర్వసాధారణంగా మారాయి. ఇవి స్త్రీల గర్భధారణ, హార్మోన్ల సమతుల్యత, బరువు, నెలసరి చక్రం మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. మందులు దీర్ఘకాలికంగా వాడటం మంచిది కాదు, ఎందుకంటే అవి కేవలం లక్షణాలను అణిచివేస్తాయి. యోగా సహజమైన, సురక్షితమైన ప్రభావవంతమైన పరిష్కారం. ఇది లక్షణాల నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా శరీరానికి అంతర్గత సమతుల్యతను అందిస్తుంది. రోజుకి 20 నిమిషాలు సరైన ఆసనాలు వేస్తే హార్మోన్ల సమతుల్యత, ఒత్తిడి నియంత్రణ, బరువు నియంత్రణ మెరుగైన నెలసరి చక్రం వంటి ప్రయోజనాలు పొందవచ్చు.
ప్రతి స్త్రీకి ఎక్కువ సేపు వ్యాయామం లేదా ధ్యానం చేయడానికి సమయం ఉండదు, ముఖ్యంగా ఉద్యోగస్తులు లేదా తల్లులైతే. అందుకే PCOS/PCOD సమస్యతో బాధపడుతున్న స్త్రీలు కేవలం 20 నిమిషాల్లో ఈ యోగాసనాలు వేస్తే చాలు.
1. తిత్తిలి ఆసనం (Butterfly Pose)
ఈ యోగా ఆసనం పెల్విక్ ప్రాంతంలో రక్త ప్రసరణను పెంచుతుంది, అండాశయాల పనితీరును మెరుగుపరుస్తుంది నెలసరిని క్రమబద్ధీకరిస్తుంది. రెండు పాదాలను కలిపి, మోకాళ్లను పైకి కిందికి కదిలించండి. నడుము నిటారుగా ఉంచండి.
2. సేతుబంధాసనం (Bridge Pose)
ఈ ఆసనం హార్మోన్ల సమతుల్యతకు కడుపు కింది భాగంలోని కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. వెల్లకిల పడుకుని మోకాళ్లను వంచి, పిరుదులను పైకి లేపి, అక్కడ సమతుల్యతను కాపాడుకోండి.
3. భుజంగాసనం (Cobra Pose)
భుజంగాసనం మీ అండాశయాలు గర్భాశయాన్ని ఉత్తేజపరుస్తుంది, నెలసరి చక్రాన్ని మెరుగుపరుస్తుంది. దీన్ని చేయడానికి బోర్లా పడుకుని, అరచేతులను భుజాల దగ్గర ఉంచి, నెమ్మదిగా పైకి లేచి, ఆపై కొంతసేపు అలాగే ఉండండి.
4. బాలాసనం (Child Pose)
బాలాసనం ఒత్తిడిని తగ్గిస్తుంది, నెలసరి సమయంలో వచ్చే నొప్పులు వెన్నునొప్పిని తగ్గిస్తుంది. వజ్రాసనంలో కూర్చుని, ముందుకు వంగి, నుదురు నేలను తాకేలా ఉంచండి. చేతులను ముందుకు చాచండి.
5. మార్జాలాసనం + బిటిలాసనం (Cat-Cow Pose)
ఈ యోగాసనాన్ని ప్రతిరోజూ చేస్తే వెన్నెముకకు వశ్యత కడుపు పెల్విక్ ప్రాంతానికి మసాజ్ లభిస్తుంది, దీనివల్ల హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది. మోకాళ్ల అరచేతులపై ఆధారపడి, గాలి పీలుస్తూ వెన్ను కిందికి తల పైకి (Cow Pose), గాలి వదులుతూ వెన్ను పైకి తల కిందికి (Cat Pose) తీసుకురండి.
6. పశ్చిమోత్తానాసనం (Seated Forward Bend)
2 నిమిషాలు ఈ ఆసనం వేయడం వల్ల అండాశయాల పనితీరు మెరుగుపడుతుంది ఒత్తిడి తగ్గుతుంది. దీన్ని చేయడానికి కాళ్లను ముందుకు చాచి కూర్చుని, నెమ్మదిగా ముందుకు వంగండి.
7. ప్రాణాయామం..
చివరిగా 6 నిమిషాలు ప్రాణాయామం చేయండి. శ్వాస సమతుల్యత మొత్తం వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. హార్మోన్ల సమతుల్యత ఒత్తిడి నిర్వహణకు ఇది చాలా ముఖ్యం. అనులోమ-విలోమ (4 నిమిషాలు) చేయడానికి ఒక ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చుకుని, మరొక దాని ద్వారా వదలండి. భ్రమరి (2 నిమిషాలు) కోసం కళ్ళు మూసుకుని, లోతైన శ్వాస తీసుకుని, ‘హమ్మ్’ శబ్దం చేయండి.