
ప్రస్తుతం చాలామంది తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే ఇంట్లో తయారుచేసుకున్న ఆయుర్వేద ఆయిల్ తో ఈ సమస్యకు ఈజీగా చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. ఈ ఆయిల్ ను సరిగ్గా నెల రోజులు వాడితే చాలు.. తెల్లజుట్టు నల్లగా మారడంతోపాటు బాగా పెరుగుతుందని చెబుతున్నారు. మరి ఆ ఆయిల్ ఏంటీ? దాన్నిఎలా తయారుచేసుకోవాలి? ఎలా ఉపయోగించాలి? వంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఈ ఆయుర్వేద ఆయిల్ తయారు చేయడానికి కొబ్బరి నూనె, ఉసిరికాయ పొడి, కరివేపాకు, కలొంజి గింజలు, మెంతులు కావాలి. వీటన్నింటిని కలిపి ఆయిల్ తయారుచేసి రెగ్యులర్ గా జుట్టుకు రాసుకుంటే తెల్లజుట్టు సమస్య తగ్గుతుంది .
ఈ ఆయిల్ తయారీకి మందమైన కడాయి తీసుకోండి. దానిలో కొబ్బరి నూనె పోసి కొద్దిగా వేడి చేయండి. నూనె వేడెక్కిన తర్వాత, ఉసిరికాయ పొడి, కరివేపాకు, కలొంజి గింజలు మెంతులు వేయండి. కరివేపాకు నల్లగా మారేవరకు, నూనెకు అన్నింటి రంగు పట్టేవరకు సన్నని మంట మీద ఉడికించండి. ఇది సుమారు 10-15 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, ఆయిల్ చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఆయిల్‌ని శుభ్రమైన బట్టతో లేదా జల్లెడతో వడకట్టి గాజు సీసాలో నిల్వ చేసుకోండి.
ఈ ఆయిల్‌ని మీరు వారానికి 2 నుంచి 3 సార్లు రాసుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు ఆయిల్‌ని కొద్దిగా వేడి చేసి వేళ్ల సహాయంతో జుట్టు కుదుళ్లకు బాగా మసాజ్ చేయండి. మరుసటి రోజు ఉదయం జుట్టుని శుభ్రం చేసుకోండి.
ఈ ఆయిల్ రాసుకోవడం వల్ల జుట్టుకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది క్రమంగా తెల్లజుట్టుని నల్లగా మారుస్తుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు బలంగా మారుతుంది. జుట్టు దట్టంగా, మెరుస్తూ కనిపిస్తుంది. ఈ ఆయిల్ జుట్టుకి లోపలి నుంచి పోషణనిస్తుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది.