Dec 28, 2019, 12:20 PM IST
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర పట్టణంలో గత నాలుగు దశాబ్దాలుగా ప్రజల నీటి అవసరాలు తీర్చిన వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరింది. ఇళ్ల మధ్యలో శిథిలావస్థకు చేరిన ట్యాంకు ప్రమాదకరంగా మారడంతో అధికారులకు పిర్యాదు చేశారు. అరవై అడుగుల పొడవైన వాటర్ ట్యాంకును లేటెస్ట్ టెక్నాలజీతో కూల్చి వేశారు అధికారులు. హైదరాబాద్ కు చెందిన నిపుణులు నాలుగు గంటల పాటు శ్రమించి చుట్టుపక్కల ఇళ్లకు, ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా కూల్చివేశారు.