కూరగాయలు రేట్లు ఎక్కువున్నయని రోజు చికెన్ తింటున్నం : అధిక ధరలకు స్టూడెంట్ పరిష్కారం..!

Jul 6, 2023, 9:57 PM IST

అకాల వర్షాల దెబ్బకు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కూరగాయలు కొనడానికి వెళితే వాటి రేట్లు క్రికెటర్ల స్కోర్ల మాదిరి సెంచరీలు దాటేశాయి. టమాటా, పచ్చిమిర్చి 12 నుంచి 140 రూపాయల ధర పలుకుతున్నాయి. ఇంకొన్ని మిగిలిన కూరగాయలది కూడా అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో కొందరు కాలేజీ విద్యార్థులు ఇదే అదునుగా రోజు చికెన్ లాగిస్తున్నారట. వారు చెప్పిన ఫన్నీ రీజన్ మీకోసం..!