`బాషా` సినిమా చిరంజీవి చేయాల్సిందా? ఎలా మిస్‌ అయ్యింది? అల్లు అరవింద్‌ దెబ్బేశాడా?

Published : Nov 26, 2024, 04:47 PM IST

రజనీకాంత్‌ నటించిన `బాషా` సినిమాని చిరంజీవి చేయాల్సిందా? ఎలా మిస్‌ అయ్యింది. అల్లు అరవింద్‌ అసలు కారణమా? 

PREV
16
`బాషా` సినిమా చిరంజీవి చేయాల్సిందా? ఎలా మిస్‌ అయ్యింది? అల్లు అరవింద్‌ దెబ్బేశాడా?

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన చిత్రాల్లో `బాషా` సినిమా ప్రత్యేక స్థానం. అప్పటికే మాస్ హీరోగా తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఆయనకు తిరుగులేని సూపర్‌ స్టార్‌ని చేసిన మూవీ. మాస్‌ కమర్షియల్‌ హీరోగా మరో పది మెట్లు ఎక్కించిన చిత్రం. ఇండస్ట్రీని షేక్‌ చేసిన సినిమా. ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్‌ చేసిన మూవీ. `బాషా` సినిమా అప్పట్లో ఓ సంచలనం. దాని ప్రభావం తెలుగు, తమిం, కన్నడ, మలయాళం, హిందీలోనూ ఉందంటే అతిశయోక్తి లేదు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

26

రజనీకాంత్‌, నగ్మా జంటగా నటించిన ఈ మూవీలో రఘువరన్‌ విలన్‌గా నటించారు. సురేష్‌ క్రిష్ణ దర్శకత్వంలో వహించారు. గ్యాంగ్‌ స్టర్స్ సినిమాలకు సంబంధించిన ఓ ట్రెండ్‌ సెట్టింగ్‌ మూవీ అని చెప్పొచ్చు. దీని ఆధారంగా ఎన్నో సినిమాలు ఆ తర్వాత వచ్చాయి.

కొన్ని హిట్‌ అయ్యాయి. మరికొన్ని బోల్తా కొట్టాయి. 1995లో విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అప్పట్లోనే సుమారు 50కోట్ల వరకు కలెక్ట్ చేసిందని చెబుతారు. సౌత్‌ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా ఇది నిలిచిందంటే అతిశయోక్తి లేదు. 

36

అయితే ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి చేయాల్సి ఉండేనట. మరి చిరుకి ఎలా మిస్‌ అయ్యింది. అసలేం జరిగిందనేది చూస్తే, రజనీకాంత్‌ `బాషా` సినిమా చేస్తున్న సమయంలోనే చిరంజీవి `బిగ్‌ బాస్‌` మూవీ చేస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాల కథలు ఒక్కటే అనే వార్తలు వచ్చాయట. చిరంజీవి మూవీ అప్పటికే ప్రారంభమైంది.

రెండూ సేమ్‌ వస్తున్నాయా? అనే డౌట్‌ వచ్చిన `బాషా` దర్శకుడు సురేష్‌ కృష్ణ.. పక్కనే షూటింగ్‌ జరుపుకుంటున్న సమయంలో వెళ్లి చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్‌ని కలిసి ఈ స్టోరీ నెరేట్‌ చేశాడట. ఈరెండు సినిమా స్టోరీస్‌ ఒక్కటే కాదని అని తెలిసింది. 
 

46

అంతేకాదు `బాషా` స్టోరీ విని చిరు, అల్లు అరవింద్‌ షాక్‌ అయ్యారట. చాలా ఎగ్జైట్‌ అయ్యారట.ఈ మూవీని తెలుగులో తాము చేస్తామని చెప్పారట. నిర్మాతకు రీమేక్‌ రైట్స్ కూడా అడిగారు. షూటింగ్‌ దశలోనే ఈ చర్చలు జరిగాయి. అల్లు అరవింద్‌ 20లక్షలు రీమేక్‌ రైట్స్ కోసం ఇస్తానని తెలిపారు. అలా చర్చలు నడుస్తున్నాయి.

అగ్రిమెంట్‌ ఫైనల్‌ కాలేదు. ఈ లోపు సినిమా పూర్తయి రిలీజ్‌ అయ్యింది. సంచలన విజయం సాధించింది. దీంతో సినిమాకి డిమాండ్‌ పెరిగింది. రీమేక్‌ రైట్స్ 40లక్షలు డిమాండ్‌ చేశారట సదరు నిర్మాతలు. దీంతో అల్లు అరవింద్‌ వెనక్కి తగ్గాడు. 

56
NTR

ఇంతలో మోహన్‌బాబు కూడా ఇన్‌వాల్వ్ అయ్యాడట. తాను చేస్తానని చెప్పి రైట్స్ కోసం ప్రయత్నించాడట. ఇలా ఇద్దరు ముగ్గురు అప్రోచ్‌ కావడంతో డిమాండ్‌ బాగా పెరిగింది. అరవింద్‌ లైట్‌ తీసుకున్నారు. అదే సమయంలోనే డబ్బింగ్‌ రైట్స్ కోసమే ఏకంగా 80లక్షల కోసం ఆఫర్‌ వచ్చింది. దీంతో డబ్బింగ్‌ రైట్స్ ఇచ్చేశారు.

అలా డైరెక్ట్ గా  `బాషా`గా తెలుగులో డబ్‌ చేసి రిలీజ్‌ చేశారు. ఇక్కడ కూడా సంచలన విజయం సాధించింది. రజనీకాంత్‌కి తెలుగులో మార్కెట్‌ని పెంచింది. తెలుగు నిర్మాతలకు లాభాల పంట పండించిందీ మూవీ.
 

66

మొత్తంగా `బాషా` సినిమాని రీమేక్‌ చేయాల్సిన చిరంజీవికి మిస్‌ అయిపోయింది. తెలుగులో చిరంజీవి చేసి ఉంటే సినిమా లెక్క వేరే స్థాయిలో ఉండేది. చిరంజీవికి తిరుగులేని మాస్‌ ఇమేజ్‌ని తీసుకువచ్చేది. అయితే ఆ సమయంలోనే చేసిన `బిగ్‌ బాస్‌` డిజప్పాయింట్‌ చేసింది. అలా కారణాలేవైనా చిరు ఓ ఇండస్ట్రీ హిట్‌ని మిస్‌ చేసుకున్నాడని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం చిరు `విశ్వంభర` చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. సోషియో ఫాంటసీగా ఈ మూవీ రూపొందనుంది. 

read more:పవన్‌ కళ్యాణ్‌ వదిలేసిన సినిమాతో హిట్‌ కొట్టి లవర్‌ బాయ్‌గా స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

also read: నెట్‌ ఫ్లిక్స్ చేతిలో నాగచైతన్య, శోభితా మ్యారేజ్‌ ఓటీటీ రైట్స్, ఎంతనో తెలిస్తే మతిపోవాల్సిందే


 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories