Dec 7, 2020, 2:43 PM IST
హైదరాబాద్: గత నాలుగేళ్లుగా పోస్టు భర్తీ చేయకుండా తాత్సారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ పీఈటి అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. వెంటనే పీఈటీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు ఇవాళ ప్రగతి భవన్ ముట్టడించారు. పోస్టులు భర్తీ చేయకపోతే కనీసం తమకు కారుణ్య మరణానికి అవకాశం ఇవ్వాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఇలా ప్రగతి భవన్ లోకి చొచ్చుకు పోయేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను అరెస్టు చేసిన పోలీసులు దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు తరలించారు.