టైటిల్ గెలుస్తానో లేదో తెలియదు, కమెడియన్ కి అర్హత లేదా.. కన్నీళ్లు పెట్టుకున్న అవినాష్

First Published | Dec 12, 2024, 10:38 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 షో చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో విజేత ఎవరు అనే ఆసక్తి పెరిగిపోతోంది. నబీల్, ప్రేరణ, నిఖిల్, అవినాష్, గౌతమ్ ఫైనలిస్టులుగా చివరి వారంలో ఉన్నారు. చాలా మంది అంచనా వేస్తున్న దాని ప్రకారం టైటిల్ పొతే నిఖిల్, గౌతమ్ మధ్య ఉంటుందని చెబుతున్నారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 షో చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో విజేత ఎవరు అనే ఆసక్తి పెరిగిపోతోంది. నబీల్, ప్రేరణ, నిఖిల్, అవినాష్, గౌతమ్ ఫైనలిస్టులుగా చివరి వారంలో ఉన్నారు. చాలా మంది అంచనా వేస్తున్న దాని ప్రకారం టైటిల్ పొతే నిఖిల్, గౌతమ్ మధ్య ఉంటుందని చెబుతున్నారు. ఈ రోజు ఎపిసోడ్ ఎమోషనల్ గా సాగింది. 

బిగ్ బాస్ గౌతమ్, అవినాష్ ల బ్యూటిఫుల్ జర్నీని ఒక్కొక్కరిగా చూపించారు. సీజన్ 8 లో తమ మెమొరీస్ ని ఆల్బమ్ రూపంలో చూసుకుని గౌతమ్, అవినాష్ ఎమోషనల్ అయ్యారు. ముందుగా గౌతమ్ తన జర్నీని ఏవీ రూపంలో చూశాడు.గౌతమ్ సీజన్ 7లో పాల్గొన్నాడు. సీజన్ 8లో అతడికి వైల్డ్ కార్డు ద్వారా అవకాశం వచ్చింది. సీజన్ 7లో తాను పూర్తి పెర్ఫామ్ చేయలేకపోయాను అని.. ఈ సీజన్ లో మా అమ్మ గర్వపడేలా చేస్తానని మాట ఇచ్చి వచ్చినట్లు గౌతమ్ తెలిపాడు. అమ్మకి మాట ఇచ్చినట్లే ఫైనల్ కంటెస్టెంట్ గా అర్హత సాధించా. అందరి గౌరవం సంపాదించా అని గౌతమ్ పేర్కొన్నాడు. 

Tap to resize

ఇంతవరకు నాకు గౌరవం ఇచ్చిన వాళ్ళు లేరు. ఇప్పుడు అందరి మర్యాదని పొందాను అని ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత అవినాష్ తన జర్నీ చూసుకున్నాడు.  అవినాష్ కూడా వైల్డ్ కార్డు ఎంట్రీనే. సీజన్ 4లో అవినాష్ పాల్గొన్నాడు. 

ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చాను. ఫైనల్ వీక్ కి చేరుకోవడం సంతోషంగా ఉంది అని బిగ్ బాస్ కి అవినాష్ థ్యాంక్స్ చెప్పారు. నా తుది శ్వాస వరకుఆ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. కమెడియన్ కమెడియన్ గానే ఉంటారు అని చాలా మంది కామెంట్స్ చేశారు. కమెడియన్ బిగ్ బాస్ టైటిల్ గెలవకూడదా అనే ఆలోచన నాలో ఎప్పటి నుంచో ఉంది. నాకు గొడవలు పెట్టుకోవడం రాదు. ఎంటర్టైన్ చేయడమే తెలుసు అని అవినాష్ తెలిపారు. టైటిల్ గెలుస్తానో లేదో తెలియదు కానీ ఆడియన్స్ మనసు మాత్రం గెలిచాను అని అవినాష్ కన్నీళ్లు పెట్టుకున్నారు. 

Latest Videos

click me!