పాకిస్థాన్‌లో ఇండియన్ రైలు
గత ఐదు సంవత్సరాలుగా పాకిస్థాన్‌లో ఒక భారతీయ రైలు ఆగి ఉంది. ఇలా ఏళ్ల తరబడి నిలిచివుండటంతో ఈ రైలు బోగీలు తుప్పు పట్టి పాడయిపోతున్నాయి. కానీ ఈ రైలు భారత్‌కు తిరిగి రాలేని పరిస్థితి ఏర్పడింది. రాజకీయ, దౌత్య పరమైన సమస్యల కారణంగా రైలు సర్వీస్ నిలిచిపోయింది.
సంఝౌతా ఎక్స్‌ప్రెస్
ఈ రైలు కథ 1971లో భారత్, పాక్ ప్రధానులు ఇందిరా గాంధీ, జుల్ఫికర్ అలీ భుట్టోల మధ్య జరిగిన సిమ్లా ఒప్పందంతో మొదలైంది. దీని ప్రకారం సంఝౌతా ఎక్స్‌ప్రెస్ అట్టారీ, లాహోర్ మధ్య ప్రారంభమైంది. ఇది మొదట కేవలం వారానికి ఒకేసారి నడిచేది. 1994లో వారానికి రెండు సార్లు మాత్రమే నడపాలని నిర్ణయించారు.
ఇండియా పాకిస్థాన్ వివాదం
2019లో కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో పాకిస్థాన్ లోనే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసింది. అప్పుడు భారత రైల్వేకి చెందిన 11 బోగీలు పాకిస్థాన్‌లో ఉండిపోయాయి. అవి ఇంకా అక్కడే ఉన్నాయి. అదే సమయంలో పాకిస్థాన్ రైలుకు చెందిన 16 బోగీలు అట్టారీ రైల్వే స్టేషన్‌లో ఉన్నాయి.
ఇండియా-పాకిస్థాన్ రైలు సర్వీస్
ఇండియా-పాకిస్థాన్ రైల్వే ఒప్పందం ప్రకారం, భారత బోగీలు పాకిస్థాన్ ఇంజిన్ల సాయంతో భారత్‌కు తిరిగి రావాలి. కానీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఈ ప్రక్రియకు అడ్డంకిగా ఉన్నాయి.
సంఝౌతా ఎక్స్‌ప్రెస్
ఈ రైలు పాకిస్థాన్‌లో ఆగి ఉన్నప్పటికీ, ఇది రెండు దేశాల మధ్య సంబంధాలకు ఒక మైలురాయిగా ఉంది. భవిష్యత్తులో రెండు దేశాలు కలిసి ఈ సమస్యను పరిష్కరించి, ఈ రైలును తమ దేశానికి తిరిగి తెచ్చుకుంటాయని ఆశిస్తున్నాం.