School Holidays : ఏపీలో భారీ వర్షాలు ... రేపు ఆ జిల్లాలో స్కూళ్ళు, కాలేజీలకు సెలవుండే ఛాన్స్

First Published | Dec 12, 2024, 9:22 PM IST

ఆంధ్ర ప్రదేశ్ మళ్లీ వర్షాలు షురూ అయ్యాయి. ఈ నేపథ్యంలో స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు మొదలయ్యాయి. ఇవాళ పలు జిల్లాల్లో సెలవులు కొనసాగగా రేపు కూడా వుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Andhra Pradesh Rains

Andhra Pradesh Rains : ఆంధ్ర ప్రదేశ్ లో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. ఇటీవల ఫెంగల్ తుపాను సృష్టించిన భీభత్సాన్ని మరిచిపోకముందే మళ్లీ వర్షాలు షురూ అయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మరికొన్నిరోజులు కొనసాగే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో వర్షతీవ్రత ఎక్కువగా వున్న జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. భారీ వర్షాలతో వరదలు సంభవించే ప్రమాదం వుంటుంది...కాబట్టి లోతట్టు ప్రాంతాలు, నదులు, నీటిప్రవాహాలకు దగ్గర్లో నివాసముండే ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. 

ఇప్పటికే అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి... ఇది మరింత బలపడి వాయుగుండం మారే ప్రమాదం వుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీని ప్రభావంతో మరో మూడునాలుగు రోజులు ఈ వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం వుందని హెచ్చరిస్తున్నారు. భారీ నుండి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ కుండపోత కురిసే అవకాశం వుంది... కాబట్టి ప్రజలు,అధికారులు అప్రమత్తంగా వుండాలని సూచిస్తున్నారు. 

కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ(గురువారం) కొన్ని జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చారు. ఈ వర్షాలు మరింత పెరిగే అవకాశం వుందన్న హెచ్చరికల నేపథ్యంలో రేపు (శుక్రవారం) కూడా సెలవులు కొనసాగే అవకాశం వుంది. వర్ష తీవ్రతను బట్టి ఆయా జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ ఉన్నతాధికారులు సెలవుపై నిర్ణయం తీసుకుంటారు. 
 

school holidays

ఏయే జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు? 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, అనకాపల్లి, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయంనుండి కుండపోతగా వర్షం కురుస్తుండటంతో తిరుపతి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. అలాగే అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కూడా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇచ్చారు. 

రేపు(శుక్రవారం) కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ క్రమంలోనే వర్ష ప్రభావిత జిల్లాల్లో రేపు కూడా స్కూళ్లకు సెలవు ఇచ్చే అవకాశాలు కనిస్తున్నాయి. వరద తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా ముందుజాగ్రత్తలు చేపడుతున్నారు అధికారులు. ఇందులో భాగంగానే విద్యార్థులకు సెలవు ఇచ్చే అవకాశాలున్నాయి. 

రేపు(శుక్రవారం) ఉదయమే వర్ష తీవ్రతను బట్టి ఆయా జిల్లాల కలెక్టర్లు విద్యాసంస్థలకు సెలవులపై నిర్ణయం తీసుకుంటారు. అయితే వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా వుండే ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి అక్కడి ఉన్నతాధికారులు,విద్యాశాఖ సిబ్బంది స్కూళ్లకు సెలవుపై నిర్ణయం తీసుకుంటారు. మొత్తంగా మరో మూడునాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మళ్లీ విద్యాసంస్థలకు సెలవులు మొదలయ్యాయి. 
 

Tap to resize

Tirupati Rains

నెల్లూరు, తిరుపతిలో కుండపోత : 

బంగాళాఖాతంలో ఏర్పడిన  అల్పపీడన ప్రభావం నెల్లూరు, తిరుపతి జిల్లాలపై గట్టిగా వుంది. ఇప్పటికే ఈ జిల్లాల్లోని చాలాప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, అనకాపల్లి జిల్లాల ప్రజలు ఈ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రైతులకు తీవ్ర పంటనష్టం జరుగుతోంది. సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. వెంకటగిరి, డక్కిలి,బాలాయపల్లి మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

ఇక తిరుపతి జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి పట్టణంలోని రోడ్లు ఈ వర్షాలకు జలమయం అయ్యాయి... అక్కడక్కడ మోకాల్లోతు నీళ్లు నిలవడంతో స్కూళ్లకు వెళ్లిన విద్యార్థులు, పనుల కోసం బయటకు వెళ్లే ఉద్యోగులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.రోడ్లపై వర్షపునీరు చేరడంతో వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బందులు తలెత్తాయి. పట్టణంలోని లక్ష్మీపురం కూడలి,గొల్లవానిగుంట ప్రాంతాల్లో వరదనీరు నిండింది. 

తిరుమలలోనూ ఇదే పరిస్థితి వుంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న ఈ భారీ వర్షాలతో శ్రీవారి భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఏడుకొండలపైకి వెళ్ళే ఘాట్ రోడ్లపై వాహనదారులు అప్రమత్తంగా వుండాలని టిటిడి అధికారులు హెచ్చరిస్తున్నారు. పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేసారు...గోగర్భం, పాపవినాశనం పూర్తిగా నిండిపోయి నీరు పొంగిపొర్లుతోంది. 

Vangalapudi Anitha

భారీ వర్షాలపై హోంమంత్రి అనిత రియాక్ట్ : 

భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాగాన్ని రాష్ట్ర హోంమంత్రి అనిత అప్రమత్తం చేసారు. తిరుపతి,సూళ్లూరుపేట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వివిధ ప్రాంతాలనుండి వచ్చిన భక్తులు కూడా అప్రమత్తంగా వుండాలని సూచించారు. వర్షాలు నేపథ్యంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం వున్నందుకు తిరుమల ఘాట్ రోడ్డుపై ప్రయాణసమయంలో జాగ్రత్తగా వుండాలని... ఏ సహాయం కావాల్సివచ్చినా టిటిడి అధికారులు లేదంటే పోలీసులకు సంప్రదించాలని హోంమంత్రి సూచించారు. 

ఉధృతంగా వరదనీరు ప్రవహిస్తోన్న లక్ష్మీపురం కూడలి, గొల్లవానిగుంట లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు హోంమంత్రి అనిత. ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణ నష్టం జరక్కుండా చూడాలన్నారు. వర్షాలు, వరదల కారణంగా ఆస్తి నష్టం కూడా ఎక్కువగా లేకుండా చూడాలన్నారు. 

తీవ్ర వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని రైతులు, గొర్లు,పశువుల కాపరులు, మత్స్యకారులను ఫోన్ కాల్స్, సందేశాల ద్వారా హెచ్చరికలు పంపి అప్రమత్తం చేయాలని విపత్తు నిర్వహణ శాఖను హోంమంత్రి అనిత ఆదేశించారు. తిరుపతిలో మాల్వాడిగుండం జలపాతం ఉధృతంగా ప్రవహించడం అక్కడికి ఎవ్వరినీ అనుమతించకూడదని సూచించారు. సూళ్ళూరు, కాళంగి గేట్లు ఎత్తిన నేపథ్యంలో పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. 

Latest Videos

click me!