కూకట్ పల్లిలో ఘోరం... బిల్డింగ్ కుప్పకూలి ఇద్దరు కూలీల దుర్మరణం

Jan 8, 2023, 10:05 AM IST

హైదరాబాద్ : తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో వున్న భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడి హాస్పిటల్ పాలయ్యారు. కూకట్ పల్లి బిజెపి ఆఫీస్ సమీపంలోని రామాలయం రోడ్డులో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 

కూకట్ పల్లిలో ఓ భవన నిర్మాణంలో భాగంగా నాలుగో అంతస్తులో పనులు చేస్తుండగా ఒక్కసారిగా స్లాబ్ కుప్పకూలింది. నాలుగు, మూడు అంతస్తులు కుప్పకూలడంతో పదిమంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిలో ఇద్దరు మృతి చెందగా మిగతావారు గాయాలతో భయటపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని పోలీసులు, అగ్నిమాపక మరియు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సహాయక చర్యలు చేపట్టి బయటకు తీసారు. నాణ్యతా లోపం కారణంగానే భవనం శ్లాబు కూలినట్లుగా తెలుస్తోంది. మృతులను యూపీకి చెందిన దయా శంకర్,ఆనంద్ కుమార్‌లుగా గుర్తించారు.