Jul 15, 2020, 4:05 PM IST
ప్రైవేటు విద్య ,ఉద్యోగ శిక్షణ సంస్థలు ఇప్పటికే ఆన్లైన్ లో క్లాస్ లు చెప్పడం లేదా రికార్డు చేసి యూట్యూబ్ లో పెట్టడం చేస్తున్నారు. అయితే ఇప్పుడు విద్యా శాఖ కూడా ఆన్లైన్ బాటలో నడవబోతోంది. కరోనా కారణంగా విద్యా సంస్థలు తెరవడం ఆలస్యం అవడంతో ప్రభుత్వ విద్యార్థులు వెనక పడిపోతారనే ఉద్దేశంతో ఇంటర్ విద్యాశాఖ త్వరలో యూట్యూబ్ ఛానల్ తెరవబోతుంది. ఇందుకోసం నిపుణులను ఇంటర్ విద్యాశాఖకు పిలిపించి క్లాసులు రికార్డు చేస్తున్నారు.