What Happen before Death
హిందూ మతంలో అనేక గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాలలో హిందూ సంప్రదాయాల గురించి చాలా విషయాలు వివరించారు. అలాంటి వాటిల్లో గరుడ పురాణం కూడా ఒకటి. దీనినే విష్ణు పురాణం అని కూడా చెబుతారు.
ఈ గరుడ పురాణంలో మనిషి చావు, పుట్టుకల గురించి వివరించారు. అంతేకాదు.. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎలాంటి శిక్షలు ఎదుర్కోవలసి వస్తుంది అనే విషయాలు కూడా పొందుపరిచారు. కాగా.. గరుడ పురాణం ప్రకారం ఒక మనిషికి చనిపోయే ముందు కొన్ని సంకేతాలు ముందుగా వస్తాయట. చనిపోవడానికి కొన్ని క్షణాల ముందు వారికి కొన్ని విషయాలు తెలుస్తాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…
చనిపోవడానికి కొన్ని క్షణాల ముందు.. ఒక వ్యక్తి తన నీడను చూడలేడట. అంతేకాదు.. కంటి చూపు కూడా బలహీనంగా మారిపోతుంది. ఈ రెండూ ఒకేసారి వచ్చాయి అంటే.. మరి కొద్ది క్షణాల్లో ఆ వ్యక్తికి మరణం సంభవిస్తుందని అర్థమట.
what Garuda purana says
గరుడ పురాణం ప్రకారం, మరణానికి ముందు కలలో తమ పూర్వీకులు కనిపిస్తారట. అది కూడా విచారంగా, ఏడుస్తూ కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. మరణానికి ముందు, ఒక వ్యక్తి తన జీవితాంతం చేసిన పనులను గుర్తుంచుకోవడం ప్రారంభిస్తాడు. అతను తన పనులన్నీ కలలో చూడటం ప్రారంభిస్తాడు. ఇవి మంచి లేదా చెడు కావచ్చు. ఇలాంటి వాటిని చూస్తే మరణం దగ్గర్లోనే ఉందని సూచిస్తుంది. యమదూత స్వరూపం కూడా కనపడే అవకాశం ఉందట. ఒక వ్యక్తి కలలో గేదె లేదా మరణ దూతను చూడటం లాంటి సంకేతాలు వస్తాయట.