vuukle one pixel image

ఔదార్యం చాటుకున్న కేసీఆర్: వృద్ధుడి కోసం కారు దిగి.. సమస్య పరిష్కారం

Feb 28, 2020, 12:15 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. వికలాంగుడైన ఓ వృద్ధుడి సమస్యను నడిరోడ్డుపైనే పరిష్కరించారు. వివరాల్లోకి వెళితే.. గురువారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం వెళ్తుండగా మార్గమాధ్యంలో టోలీచౌకి మీదుగా వస్తున్నారు.ఈ క్రమంలో రోడ్డుపై వికలాంగుడైన ఓ వృద్దుడు చేతిలో దరఖాస్తుతో కనిపించారు. అతనిని చూసిన ముఖ్యమంత్రి వెంటనే కారు దిగి పెద్దాయన దగ్గరకి వెళ్లి సమస్య అడిగి తెలుసుకున్నారు.