KCR Birthday:మేడారంలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుక... కేక్ కట్ చేసిన దేవాదాయ మంత్రి

Feb 17, 2022, 11:52 AM IST

మేడారం: తెలంగాణ సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలు, వేడులకు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వనదేవతలు మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధిలోనూ కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. మేడారం జాతర పర్యవేక్షణలో భాగంగా అక్కడే వున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యాటక శాఖ గెస్ట్ హౌస్ లో  కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. సమ్మక్క సారలమ్మ  దీవెనలతో  సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.