నాగ మణికంఠ ఎలిమినేషన్ ఒకింత చర్చకు దారి తీసింది. ఆయన అభిమానులు నిరాశ చెందారు. నాగ మణికంఠ జర్నీకి సంబంధించిన స్పెషల్ ఏవీ కూడా ప్రదర్శించలేదు. నాగ మణికంఠకు ఓట్లు పడుతున్నాయి. కాబట్టి అతడు ఎలిమినేట్ కాడని టీమ్ భావించి ఉండొచ్చు. గౌతమ్ కి తక్కువ ఓట్లు వచ్చాయి కనుక అతడి ఏవీ ఎడిట్ చేసి ఉంటారనే వాదన వినిపించింది. ఏది ఏమైనా ఫైనలిస్ట్స్ లో ఒకడిగా ఉంటాడనుకున్న నాగ మణికంఠ షోకి గుడ్ బై చెప్పాడు.
కాగా గత సోమవారం 8వ వారానికి గాను నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ప్రతి కంటెస్టెంట్ ఇద్దరు కంటెస్టెంట్స్ ని తగు కారణాలు చెప్పి నామినేట్ చేయాలని ఆదేశించాడు. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ప్రక్రియ ముగిసిన అనంతరం విష్ణుప్రియ, ప్రేరణ, నయని పావని , మెహబూబ్, నిఖిల్, పృథ్విరాజ్ నామినేషన్స్ లో ఉన్నట్లు బిగ్ బాస్ తెలియజేశాడు.