Oct 24, 2024, 10:30 PM IST
థియేటర్ విజిట్‌కి వెళ్లిన 'లవ్ రెడ్డి' సినిమా టీంలోని నటుడిపై ఓ మహిళ దాడి చేసింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని నిజాంపేట జీపీఆర్ మాల్ మల్టీప్లెక్స్‌లో జరిగింది. ఈ సినిమా క్లైమాక్స్ చూసి ఎమోషనల్ అయిన ప్రేక్షకురాలు.... తండ్రి పాత్రను పోషించిన నటుడు ఎన్టీ రామస్వామి నిజంగానే ఆ ప్రేమజంటను విడిదీశాడని భావించింది. థియేటర్‌లో కనిపించిన రామస్వామిని దూషిస్తూ ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో లవ్ రెడ్డి టీం ఒక్కసారిగా షాకైంది. హీరో అంజన్ రామచంద్ర, హీరోయిన్ శ్రావణి, దర్శకుడు స్మరణ్ రెడ్డి, ఇతర సభ్యులు ప్రేక్షకురాలిని అడ్డుకుని నచ్చజెప్పారు. ఎన్టీ రామస్వామి తండ్రి పాత్రలో నటించాడని, సినిమాలో చూపించినట్లు చెడ్డవారు కాదని సర్దిచెప్పారు.
లవ్ రెడ్డి సినిమా అక్టోబర్ 18న విడుదలైంది. పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఎమోషనల్ ప్రేమకథా చిత్రం కావడంతో ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది.