రాయల్ హారర్ 'రాజా సాబ్' లో ప్రభాస్ గెటప్ మిస్టరీ ఇదే

First Published | Oct 25, 2024, 7:51 AM IST

లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన పోస్టర్లో కనిపించిన మహా రాజు క్యారెక్టర్. ఇలా హీరో పాత్రను రెండు రకాలుగా చూడగానే జనాలకు చంద్రముఖి, నాగవల్లి సినిమాలు గుర్తుకు వస్తున్నాయి. 

Prabhas, The Raja Saab, maruthi

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న హర్రర్ ఎంటర్టైనర్ 'ది రాజా సాబ్'. రీసెంట్ గా ఈ సినిమా నుంచి మేకర్స్ ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్ గా ఓ సర్ప్రైజ్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసి ఆశ్చర్యపరిచారు.

'సింహాసనం తనకు చెందిన వ్యక్తి కోసం వెయిట్ చేస్తోంది...' అంటూ ఇప్పటికే మేకర్స్ తలకిందులుగా ఉన్న ఒక సింహాసనం ఫోటోను రిలీజ్ చేసి క్యూరియాసిటీని పెంచేశారు.   'ది రాజా సాబ్' నుంచి వచ్చిన మోషన్ పోస్టర్ లో ప్రభాస్ రాజసం ఉట్టిపడే రాయల్ లుక్ లో, కొంచం భయంకరంగా, మరింత కొత్తగా కనిపించారు. 

Actor Prabhas upcoming film The Raja Saab remuneration out


ఈ పోస్టర్ లో ప్రభాస్ సింహాసనం మీద కూర్చుని చేతిలో సిగార్ తో రాజు లుక్ లో కొత్తగా కనిపించి మంచి హైప్ క్రియేట్ చేశారు. అదే సమయంలో  హర్రర్ నేపథ్యమున్న సినిమా అని ఈ మోషన్ పోస్టర్ ద్వారా రివీల్ చేశారు. అయితే ఈ పాత్ర సినిమాలో ఎప్పుడు కనిపించనుందనే చర్చ మొదలైంది.

ప్రభాస్ ‘రాజా సాబ్’లో ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్నది స్పష్టం అయ్యింది. ఇంతకుముందు రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో చూపించిన యంగ్ క్యారెక్టర్‌ ఒకటైతే.. ఇంకోటేమో లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన పోస్టర్లో కనిపించిన మహా రాజు క్యారెక్టర్. ఇలా హీరో పాత్రను రెండు రకాలుగా చూడగానే జనాలకు చంద్రముఖి, నాగవల్లి సినిమాలు గుర్తుకు వస్తున్నాయి. అదే సమయంలో ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని చెప్తున్నారు.


Prabhas, The Raja Saab, maruthi


మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు మహా రాజు పాత్ర...ఈ సినిమాలో సెకండాఫ్ లో వస్తుంది. సాలిడ్ ఉండే ఈ ఫ్లాష్ బ్యాక్ ఇప్పటి  ప్రభాస్ కు తాతగారి పాత్ర ను రివీల్ చేస్తుందని సమాచారం. ఈ పోర్షన్ దాదాపు అరగంట దాకా ఉంటుందని, ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ చాలా క్రేజీగా ఉంటారని, డైలాగ్ డెలవరీ, మేనరిజమ్స్ చాలా గమ్మత్తుగా ఉంటాయని వినికిడి. ఇప్పటివరకూ ప్రభాస్ ని అలా చూసి ఉండరని చెప్తున్నారు. 

Prabhas, The Raja Saab, maruthi


ఇదిలా ఉండగా ప్రభాస్ కల్కి సూపర్ హిట్ తో ఆయన నెక్ట్స్ పిక్చర్ రాజా సాబ్ బిజినెస్ వర్గాల్లో క్రేజ్ మామూలుగా లేదు. మారుతి దర్శకుడు కాబట్టి పెద్దగా క్రేజ్ లేదనుకున్న వాళ్లకు ఈ ప్రాజెక్టుకు వస్తున్న బిజినెస్ ఆఫర్స్ చూస్తూంటే మతిపోతోంది. అఫ్ కోర్స్ అది ప్రభాస్ కు పెరిగిన ప్యాన్ ఇండియా మార్కెట్, సక్సెస్ , ఫామ్ లో ఉండటం వంటి కారణాలు కావచ్చు.

కానీ ప్రభాస్ తో సినిమా చేస్తున్న వాళ్లకి అవన్నీ కలిసొచ్చే అంశాలే. ప్రభాస్ సినిమా అంటే వందల కోట్లకు చేరుకుంది. అలాంటప్పుడు రిటర్న్స్ ఏ స్దాయిలో ఉంటాయా అని లెక్కలేసుకునే నిర్మాత చేస్తారు. కానీ సినిమాకు వస్తున్న బిజినెస్ ఆఫర్స్ ..ఆ  లెక్కలను దగ్గర రానిచ్చే పరిస్దితి లేదంటున్నారు. తాజాగా ఈ చిత్రం ఆడియో రైట్స్ కు పలికిన రేట్లే అందుకు నిదర్శనం అంటున్నారు. 

The Raja Saab Prabhas horror film

 
ఈ స్దాయి క్రేజ్ కు ప్రభాస్‌ కొత్త తరహా కథలో నటిస్తుండడం ఓ విశషమైతే... ఇందులో ఆయన కొత్త స్టైల్‌తో కనిపించటం  మరో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని ‘రాజాసాబ్‌’టీమ్  చెబుతోంది.  ‘రాజాసాబ్‌’ఆడియో హ‌క్కుల్ని టీ సిరీస్ రూ.25 కోట్ల‌కు సొంతం చేసుకొంది.

త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్రభాస్, త‌మ‌న్ కాంబినేషన్ అంటే ఖచ్చితంగా మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ బీట్స్ ఉంటాయిని అంచనా వేస్తున్నారు. ‘రాజాసాబ్’ టైటిల్ ట్రాక్  కూడా ఓ రేంజిలో ఉంటుందని చెప్పుకుంటున్నారు. దానికి తగినట్లు  ఓ బాలీవుడ్ క్లాసిక్ పాట‌ను ఈ సినిమా కోసం రీమిక్స్ చేయ‌బోతున్నార‌ని మీడియా వర్గాల సమాచారం అందుతోంది. 

malavika mohanan in prabhas movie the raja saab


నవ్వించమే పనిగా ఉండే ఈ హారర్ కామెడీలో ఓ రీమిక్స్ సాంగ్ ఉంటే బాగుంటుందని మారుతి భావిస్తున్నారట. ప్రభాస్ సినిమాలోదే ఓ పాట తీసుకుందామనుకున్నారు కానీ ఆ తర్వాత రకరకాల కారణాలతో వద్దనుకున్నారుట. ఇప్పుడు 1980 లలో వచ్చిన ఓ పాత హిందీ పాటను రీమిక్స్ చేస్తే బాగుంటుందని మారుతి భావిస్తున్నారట. ఆ మేరకు సంగీత దర్శకుడు తమన్ తో చర్చలు జరుపుతున్నారు.

ఈ వారం పక్కాగా ఇంటికి వెళ్లే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరు?
 

The Raja Saab Prabhas film update out


రీమిక్స్ కోసం హిందీ వింటేజ్ సాంగ్ రెండు మూడు  అనుకున్నారట. వాటిలో ఒకటి ఫైనలైజ్ చేసి మందుకు వెళ్తారట.సెకండాఫ్ లో ముగ్గురు హీరోయిన్స్ తో ఓ స్పెషల్ సాంగ్ లా ఈ రీమిక్స్ సాంగ్ రాబోతోందిట. ఇక ఆ సూపర్ హిట్ సాంగ్ రైట్స్ తీసుకున్నాక అప్పుడు అఫీషియల్ గా చెప్పే అవకాసం ఉంది. ఏదైమైనా రీమిక్స్ సాంగ్ సరైంది పడితే థియేటర్స్ లో మంచి ఊపు వస్తుంది. ఆ టెక్నికే మారుతి చెయ్యబోతున్నారు. 
  

Latest Videos

click me!