బీబీ రాజ్యంలో ఎవరు ఎన్ని దక్కించుకుంటారు అని రాయల్ క్లాన్, ఓజీ క్లాన్ కు మధ్యజరుగుతున్న పోరు రసవత్తరకంగా మారింది. ఈ గేమ్ లో కూడా ఎప్పటిలాగానే ఫస్ట్ టాస్క్ ను గెలుచుకున్నారు రాయల్ క్లాన్. ఇక పట్టుదలతో రెచ్చిపోయి రాయల్ క్లాన్ పై పగతీర్చుకున్నారు ఓజీ క్లాన్. బీబీ రాజ్యం సెకండ్ టాస్క్ లో కసి చూపించారు నిఖిల్, పృధ్వ. ఏమాత్రం తగ్గకుండా రాయల్ క్లాన్ ను కట్టడి చేస్తూనే వీరిగేమ్ ను ఆడేశారు.
మెహబూబ్, గౌతమ్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కూడా ఓడించి పక్కకు పంపించారు. ఈ గేమ్ మొత్తం మీద నిఖిల్, పృధ్వీలు అద్భుతం చేశారు. ఇక ఓజీ నుంచి ఈ వారం చీఫ్ కంటెండర్ గా పృధ్వీని ఏకగ్రీవం చేశారు. ఇక ఆతరువాత జరిగిన టాస్క్ లో కూడా నిఖిల్, నబిల్ ఆడగా.. నబిల్ కూడా అద్బుతం చేశాడు. ఇక నబిల్ కంటే ఎక్కువగా నిఖిల్ ఈ గేమ్ ను ఆడి చూపించాడు. దాంతో మరోసారి బిగ్ బాస్ ఓజీ క్లాన్ నుంచి ఓ కంటెండర్ ను సెలక్ట్ చేయమన్నారు. దాంతో నిఖిల్ ను మెగా చీఫ్ కంటెండెర్ గా ఏకగ్రీవం చేశారు.