ఆడపిల్లలతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన ... గ్రామస్థుల దేహశుద్ధి

Feb 10, 2022, 5:19 PM IST

అచ్చంపేట మండలం జడపల్లి తండాలో ప్రాధమిక పాఠశాల టీచర్ శ్యామలరావుకు దేహశుద్ది చేసిన గ్రామస్తులు. గత కొంత కాలంగా అసభ్యంగా   ప్రవర్తిస్తూ ఎవరికి చెప్పొద్దంటూ బయపెడుతున్నట్లు తల్లిదండ్రులకు బాలికలు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా వికలాంగురాలైన బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో...  గ్రామస్థులు ఆగ్రహంతో దాడి చేసి గదిలో సదరు కీచక ఉపాధ్యాయుడిని బంధించి పోలీసులకు ఫిర్యాదు చేసారు. బాధితుల ఫిర్యాదుతో టీచర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు.