Jan 28, 2021, 12:37 PM IST
జనగామలో గురువారం తెల్లవారు జామున దారుణ హత్య జరిగింది. టిడిపి పార్టీ నాయకుడు, మాజీ కౌన్సిలర్ పులిస్వామిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. తెల్లవారుజామున పులిస్వామి వాకింగ్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చి కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో నడిరోడ్డుపై కుప్పకూలిన పులిస్వామి అక్కడికక్కడే మరణించాడు. భూవివాదం గానీ పాతక్షకలు గానీ హత్యకు కారణమై ఉండవచ్చునని భావిస్తున్నారు.