ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ క్యాన్సిల్ చేస్తే ఇకపై డబ్బులు కట్టాలి: త్వరలో కొత్త రూల్

First Published | Dec 12, 2024, 1:27 PM IST

మీరు ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డర్ చేశారా? అయితే కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందా? దీనికి మీరు కొంత డబ్బులు కట్టాల్సి ఉంటుంది. త్వరలో ఈ రూల్ అమలు కానుంది. దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయనున్నారు. క్యాన్సిల్ చేస్తే ఎంత కట్టాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. 
 

ఈ రోజుల్లో ఆన్‌లైన్ షాపింగ్ బాగా ఫేమస్ అయ్యింది. డైరెక్ట్ గా మాల్స్ కి, షాప్స్ కి వెళ్లి కొనడం చాలా తగ్గిపోయింది. ఎంత చిన్న వస్తువునైనా ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తే ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. 
కోవిడ్ తర్వాత ఆన్‌లైన్ షాపింగ్ మరింత వేగంగా, ఎక్కువగా జరుగుతోంది. కొన్ని కంపెనీలు జస్ట్ ఫోన్ కాల్ ద్వారా కూడా ఆర్డర్స్ తీసుకుంటున్నాయి. దీంతో అసలు ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే అన్ని వస్తువులు ఇంటికి రప్పించుకొనే అవకాశం కలుగుతోంది. అయితే ఇకపై ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టిన ఐటమ్స్ ని క్యాన్సిల్ చేస్తే ఛార్జ్ వసూలు చేయాలని కొన్ని ఈ-కామర్స్ కంపెనీలు అనుకుంటున్నాయన్న వార్త వైరల్ అవుతోంది. 
 

సాధారణంగా ఏదైనా వస్తువు ఆర్డర్ పెట్టినప్పుడు డెలివరీ అయిన తర్వాత అది మీరు అనుకున్నట్లు లేకపోయినా, నాణ్యత లేకపోయినా మరే ఇతర సమస్యలు ఉన్నా క్యాన్సిల్ చేయడానికి అవకావం ఉండేది. ప్రస్తుతం చాలా ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారుల కోసం ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. అయితే భారతదేశపు అతిపెద్ద ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన Flipcartలో ఈ ఫెసిలిటీని త్వరలో ఆపేస్తున్నారని కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. 
 

Tap to resize

ఇది అన్ని ఆర్డర్లకు కాకుండా కొన్ని నిర్దిష్ట ఆర్డర్‌లను రద్దు చేస్తే కస్టమర్‌ల దగ్గరే క్యాన్సిలేషన్ ఛార్జ్ వసూలు చేయాలని ఫ్లిప్‌కార్ట్ భావిస్తున్నట్లు సమాచారం. అంటే భవిష్యత్తులో మీరు మీ ఆర్డర్‌ను రద్దు చేస్తే డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్న మాట. ఈ రుసుము మీరు ఆర్డర్ చేసిన వస్తువు ధరపై ఆధారపడి ఉంటుందని నివేదికల ఆధారంగా తెలుస్తోంది.
 

అయితే ఫ్లిప్‌కార్ట్ ఇంకా ఈ పాలసీని అధికారికంగా ప్రకటించలేదు. కొందరు కావాలని ఆర్డర్స్ బుక్ చేసి క్యాన్సిల్ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వినియోగదారులకు, డెలివరీ సంస్థల ఇబ్బందులు తొలగించాలన్న ఆలోచనతోనే ఫ్లిప్ కార్ట్ ఈ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. ఈ కొత్త రూల్ Flipkart మాతృ సంస్థ కింద ఉన్న మరొక షాపింగ్ సైట్ Myntra కూడా అమలు చేయనుందని సమాచారం. 
 

Latest Videos

click me!