Dec 10, 2019, 5:15 PM IST
జమ్ము కాశ్మీర్ లో జరిగిన జాతీయ స్థాయి పోటిల్లో యూత్ టేబుల్ టెన్నిస్ సింగిల్స్ టైటిల్ సాధించిన స్నేహిత్, సౌత్ ఎషియాన్ గేమ్స్ లో టేబుల్ టేన్నిస్ చాంపియన్ షిప్ విభాగంలో రెండు బంగారు పతకాలను సాధించిన ఆకుల శ్రీజా ఈ రోజు రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ ను కలిశారు. వారిని సాదరంగా సత్కరించిన శ్రీనివాస్ గౌడ్ 2020 టోక్యో లో జరిగే ఒలంపిక్స్ కు తెలంగాణ రాష్ట్రం నుండి ఎక్కువ మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పుకొచ్చారు.