Aug 21, 2020, 5:58 PM IST
కరోనా పరిస్థితుల్లో ఇంట్లోనే వినాయక చవితి పూజలు నిర్వహించుకోవాలని తెలంగాణ అర్చక సంఘాలు పిలుపునిచ్చాయి. వినాయకమండపాలు వద్దనడం హిందూ వ్యతిరేకం కాదని, కరోనా కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అర్చక, ఉద్యోగ సంఘాల అధ్యక్షులు చెబుతున్నారు. కరోనా కారణంగా అన్ని మతాలు కూడా పండగ వేడుకలను ఇళ్లలోనే జరుపుకోవాలని కోరుకుంటున్నాయని కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని అన్నారు.