ట్యాక్స్ పరిధిలోకి వచ్చే వారంతా 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ దాఖలు చేయాల్సిన గడువు జులై 31. అంటే అసెస్‌మెంట్ సంవత్సరం 2024-25కు ఐటీఆర్ సబ్మిట్ చేయాలన్న మాట. జులై 31 లోపు సబ్మిట్ చేయని వారికి ఐటీఆర్ దాఖలు చేసేందుకు డిసెంబర్ 31 చివరి తేదీగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ గడువులోగా కూడా ఐటీఆర్ ఫైలింగ్ చేయించకపోతే ఫైన్ అమౌంట్ పెరుగుతుంది. పన్ను సంబంధిత ప్రయోజనాలను కూడా మీరు పొందలేరు.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234F ప్రకారం ఐటీఆర్ ను గడువు లోపు కట్టలేని వారు డిసెంబర్ 31 నాటికి ఆలస్యంగా రిటర్న్‌లను దాఖలు చేయవచ్చు. అయితే దీనికి జరిమానా కట్టాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు రూ.5,000 జరిమానా కట్టాల్సి ఉంటుంది. మొత్తం ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువ ఉన్నవారు మాత్రం రూ.1,000 జరిమానా కట్టాలి.
డిసెంబర్ 31 లోపు కూడా మీరు ఐటీఆర్ కట్టకపోతే మార్చి 31, 2025 వరకు ఐటీఆర్ దాఖలు చేసేందుకు మరో అవకాశం ఉంటుంది. అయితే ఎక్కువ జరిమానా కట్టాల్సి ఉంటుంది. అలాంటి వారు ఏకంగా రూ.10,000 ఫైన్ కట్టాలి. చెల్లించని పన్నులపై ఆగస్టు 1 నుండి నెలకు 1 % వడ్డీ కూడా చెల్లించాలి. ఈ గడువు తప్పితే విలువైన ట్యాక్స్ బెనిఫిట్స్ ని మీరు కోల్పోతారు.
ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు చేసేవారు సెక్షన్ 80C, 80D ప్రకారం పాత పన్ను విధానం కింద లభించే ట్యాక్స్ కన్సషన్స్ ను మిస్ అవుతారు. భవిష్యత్తు లాభాలను పొందడానికి ఇబ్బందులు ఎదురవుతాయి. పెట్టుబడి నష్టాలను తప్పించుకోవడానికి మీకు ఎలాంటి సహాయం అందకపోవచ్చు. ఇది భవిష్యత్తు ఎదుగుదలపై ప్రభావితం చూపిస్తుంది.
ఐటీఆర్‌ను ఎలా దాఖలు చేయాలి:
ఐటీఆర్‌ను ఆన్‌లైన్‌లో దాఖలు చేయడం చాలా సులభం. ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా దీన్ని మీరు చేయవచ్చు.
https://www.incometax.gov.in సైట్ ఓపెన్ చేయండి.
మీ పాన్ వివరాలను ఉపయోగించి లాగిన్ అవ్వండి.
అసెస్‌మెంట్ సంవత్సరం 2024-25కి సరైన ఐటీఆర్ ఫారమ్‌ను సెలక్ట్ చేసుకోండి.
అవసరమైన వివరాలను పూర్తి చేయండి. మీకు అప్లికబుల్ అయ్యే మినహాయింపులను క్లెయిమ్ చేయండి.
లేట్ ఫీ(రూ. 5,000 లేదా రూ. 1,000) చెల్లించండి.
ఫారమ్‌ను సమర్పించి, ఆధార్ OTP ద్వారా సబ్మిట్ చేయండి.