జుట్టుకు మునగాకు నూనె ప్రయోజనాలు
బలమైన జుట్టు
మన జుట్టు ప్రధానంగా కెరాటిన్ ప్రోటీన్ తో తయారవుతుంది. కానీ కెరాటిన్ ఉత్పత్తి వయసుతో పాటుగా తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల జుట్టు బలహీనంగా అవుతుంది. అలాగే వెంట్రుకలు డ్రై అవుతాయి. జుట్టు తెగిపోతుంది. సన్నబడుతుంది. వెంట్రుకలు బాగా రాలుతాయి. అయితే ఈ సమస్యలన్నింటినీ తగ్గించడానికి మునగాకు నూనె ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ నూనె కెరాటిన్ ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే వృద్ధాప్య లోపాన్ని కూడా భర్తీ చేస్తుంది.
మునగాకు నూనెలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది మన నెత్తికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. మన జుట్టును కాలుష్యం, వేడి నుంచి కాపాడుతుంది. జుట్టు బలంగా, హెల్తీగా పెరగడానికి సహాయపడుతుంది.