Jan 5, 2023, 4:58 PM IST
పెద్దపల్లి : అత్తింటివారి వరకట్నం వేధింపులు భరించలేక నిండు గర్భిణి ఆత్మహత్య చేసుకున్న దారుణం పెద్దపల్లి జిల్లాలో వెలుగుచూసింది. కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన సంధ్యారాణి(24) కి వరంగల్ కు చెందిన బొట్టు శ్రీకాంత్ తో వివాహమయ్యింది. ప్రస్తుతం సంధ్యారాణి గర్భంతో వుందని తెలిసినా భర్త, అత్తింటివారు కనికరం చూపకుండా వరకట్నం కోసం వేధించారు. దీంతో ఆ బాధలు భరించలేక సంధ్యారాణి వారంరోజుల క్రితమే పుట్టింటికి వెళ్లింది. అత్తింటివారి వేధింపులు తల్లిదండ్రులకు చెప్పలేక, తిరిగి అత్తింటికి వెళ్లలేక తీవ్ర మనోవేధనకు గురయిన ఆమె దారుణ నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని సంధ్యారాణి ఆత్మహత్య చేసుకుంది. గర్భిణి మృతితో కూనారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.