Jul 5, 2020, 12:33 PM IST
మహబూబాబాద్ జిల్లా, శనిగపురం గ్రామం, బోడతండాకు చెందిన నలుగురు పిల్లలు శనివారం నాడు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించడంతో వారి మృతదేహాలను మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ లో సందర్శించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ నేడు . ఎంతో భవిష్యత్ ఉన్న పిల్లలు హఠాత్తుగా మరణించడంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇస్తూ మృతుల కుటుంబాలకు మంత్రి 50వేల రూపాయల ఆర్ధిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీమతి మాలోత్ కవిత, ఎమ్మెల్యే శ్రీ శంకర్ నాయక్, మునిసిపల్ చైర్మన్ శ్రీ రామ్మోహన్ రెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి, డిఎస్పీ నరేష్ కుమార్, ఆర్డీఓ కొమురయ్య, ఇతర స్థానిక నేతలు, అధికారులున్నారు.