Jul 28, 2020, 12:14 PM IST
సంగారెడ్డి ఎమ్మెన్నార్ లో కరోనా కు చికిత్సకు వంద పడకలు ఉన్నాయని మంత్రి హరీష్ రావు స్టేట్మెంట్లు ఇచ్చినా, పేషంట్లను గాంధీకి రిఫర్ చేయడం మీద ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. హాస్పిటల్ సూపరిండెంట్ మీద ఫైర్ అయ్యారు. ఎమ్మెన్నార్ లో బెడ్లు ఉన్నపటికీ వైద్యులు లేరని సూపరిండెంట్ సమాధానం ఇచ్చారు. దీంతో గాంధీలో వైద్యం సరిగా అందడం లేదని, గాంధీలో సంగారెడ్డికి చెందిన కౌన్సిలర్ చనిపోయాడని, అక్కడి చావులు లెక్కలోకి రావడం లేదని మండిపడ్డారు. సంగారెడ్డికి చెందిన ఏ పేషంట్ గాంధీలో చనిపోయినా శవంతో కలెక్టర్ ఆఫీసు ముందు బైఠాయిస్తానని హెచ్చరించారు.