Bigg boss fame Pallavi Prashanth
గత ఏడాది బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే ముగిశాక అన్నపూర్ణ స్టూడియో ఎదుట అంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. పెద్ద మొత్తంలో అక్కడకు అభిమానులు చేరుకున్నారు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ ఫ్యాన్స్ పరస్పరం భౌతిక దాడులకు దిగారు.
Pallavi Prashanth
పబ్లిక్, ప్రాపర్టీ నాశనం చేశారు. ఆర్సీసీ బస్సుల మీద రాళ్లు రువ్వారు. అమర్ దీప్ కారును పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ముట్టడించారు. అతన్ని భయాందోళనకు గురి చేశారు. అన్నపూర్ణ స్టూడియో ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు పల్లవి ప్రశాంత్ కి కొన్ని సూచనలు చేశారు. ఎలాంటి ర్యాలీలు నిర్వహించవద్దు. నేరుగా ఇంటికి వెళ్లిపోవాలని బ్యాక్ డోర్ నుండి పంపారు.
పోలీసులు ఆదేశాలు బేఖాతరు చేసిన పల్లవి ప్రశాంత్... ర్యాలీ ఏర్పాటు చేశాడు. సీరియస్ అయిన పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరుడు అరెస్ట్ అయ్యారు. కోర్టు రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. రెండు రోజుల అనంతరం బెయిల్ పై పల్లవి ప్రశాంత్ విడుదలయ్యాడు. అన్నపూర్ణ స్టూడియో వద్ద లా అండ్ ఆర్డర్ అదుపుతప్పడం విమర్శలకు దారి తీసింది.
అలాగే ఈ అల్లర్లకు పాల్పడిన చాలా మందిని పోలీసులు గుర్తించలేకపోయారు. సరిపడా సీసీ కెమెరాలు లేకపోవడంతో చాలా మంది తప్పించుకున్నారు. కొందరు మాత్రమే అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలో అన్నపూర్ణ స్టూడియో వద్ద పోలీసులు 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారట. అలాగే ఎలాంటి అల్లర్లు జరగకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారట. డిసెంబర్ 15న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ ఫినాలే. అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్ద హంగామా చేసే అవకాశం ఉంది.
Bigg boss telugu 8
టైటిల్ విన్నర్ ర్యాలీలు చేయడం, మీడియాతో మాట్లాడటం వంటివి నిషేదించారట. నేరుగా ఇంటికి వెళ్లిపోవాలని ముందుగానే సూచనలు చేయనున్నారట. కొద్దిరోజుల క్రితం పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగింది. ఆ రోజులు భారీగా దొంగతనాలు చోటు చేసుకున్నాయట. ఈ చోరీలను నియంత్రించేందుకు సైతం సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారట.
Bigg boss telugu 8
కాగా నిఖిల్, గౌతమ్, అవినాష్, ప్రేరణ, నబీల్ టాప్ 5 కంటెస్టెంట్స్ గా గ్రాండ్ ఫినాలేలో ఎంట్రీ ఇచ్చారు. వీరిలో ఒకరు టైటిల్ విన్నర్ కానున్నారు. ప్రస్తుత ఓటింగ్ ట్రెండ్ చూస్తే నిఖిల్ లేదా గౌతమ్ లలో ఒకరు టైటిల్ విన్నర్ అంటున్నారు. ఇద్దరి మధ్య ఓటింగ్ లో హోరాహోరి పోరు నెలకొంది.