Lifestyle
2024లో చాలా మంది పేరెంట్స్ కొత్త పేర్లు పెట్టడానికి ఆసక్తి చూపించారు. ఆ పేర్లు కూడా.. దేవుడి పేర్లు అర్థం వచ్చేలా ఉండటం విశేషం.
నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ , బేబీ సెంటర్.ఇన్ సమాచారం ప్రకారం పిల్లల హిట్ పేర్ల జాబితాను మీతో పంచుకుంటున్నాము.
దేశంలో హిందువుల జనాభా దాదాపు 80%. చాలామంది దేవుని పేర్లతోనే తమ పిల్లల పేర్లను నిర్ణయిస్తారు.
ఇటీవలి సంవత్సరాలలో ఎక్కువగా ఇష్టపడే పేర్లలో శివాన్ష్ కూడా మంచి స్థానంలో ఉంది. ఇది శివుడికి మరో పేరు, దీని అర్థం శివునిలో ఒక భాగం.
ఇషాన్ అనే పేరు కూడా ప్రజాదరణ పొందింది. దీని అర్థం శక్తి, జ్ఞానం, ఇది భోళానాథ్ మరో పేరు.
పర్షియన్, సంస్కృత వర్ణమాలలకు సంబంధించిన ఈ పేరు కి గొప్పదైనది అర్థం.
హిందువుల్లో వేదాలను అత్యున్నతంగా భావిస్తారు. ఇవి జ్ఞాన నిధిగా పరిగణిస్తారు. వేదాంత అనే పేరు కూడా పిల్లలకి బాగా నచ్చుతుంది.
పిల్లలు సూర్యుడిలా ప్రకాశవంతంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. వివాన్ అంటే ఉదయపు కిరణాలు, ఈ పేరు అబ్బాయిలకు సరిపోతుంది.